Pages

Sunday 28 August 2011

మట్టి వినాయకుడికీ జై!

                                                              
వినాయక చవితి సమీపించింది. రెండు రోజుల్లో తమ తమ ఇళ్ళలో పూజించే ప్రతి ఒక్కరూ చిన్న చిన్నవిగ్రహాలను కొనుగోలు చేయడం మొదలుపెడతారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాదన్నా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. పక్కింటి వారిని చూసి పోటీ పడకుండా., పొరుగు కాలనీ వారికంటే పెద్ద విగ్రహం పెట్టాలనుకోకుండా, భారీ విగ్రహం పెట్టి మన అపార్టుమెంటులో ఇతరుల కంటే ఘనంగా చేయాలనే గొప్పలకు పోకుండా మట్టి విగ్రహాలను పెట్టి మన పరిసరాలను కాపాడుకుందాం. ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. ఈ రోజు మిత్రుడు వాసిరెడ్డి అమరనాధ్ గారు తన స్లేట్ స్కూల్ లో 2000 మట్టివిగ్రహాలను తన విద్యార్ధులకు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. పర్యావరణంపై విద్యార్ధుల్లో చైతన్యం తీసుకు రావాలనే వారి తపనను అభినందిస్తూ, గత ఏడాది కంటే మరింత మంది మట్టి విగ్రహాలు పెట్టి పూజించాలని కోరుకుంటూ సకల జనావళికి రంజాన్, వినాయక చవితి శుభాకాంక్షలు.

3 comments:

amarnath vasireddy said...

thank you very much sir. it was our duty amarnath vasireddy

Anonymous said...

తప్పకుండా నా బాద్యత నిర్వర్తిస్తాను సర్

ravichand said...

సార్... నేనైతే మట్టి విగ్రహం తీసుకొచ్చా..... పర్యావరణం కాపాడడంలో నావంతు బాద్యతను నిర్వర్తించా...