Pages

Saturday 20 January 2018

పొలాల్లో అంకురిస్తున్న అద్భుతాలు

ఇజ్రాయెల్ వ్యవసాయ సాంకేతిక అద్భుతాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు నేడు ప్రచురించింది.  
                                      

Sunday 14 January 2018

కౌలుదారులకూ భరోసా ఇవ్వండి!

సేద్యంలో నేడు సగం మంది కౌలుదారులే. వాస్తవ సాగుదారులుగా  భూ యజమానులకు అందుతున్న రాయితీలు, రుణాలు, పరిహారాలు కౌలుదార్లకూ దక్కాలి. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.

సంక్రాంతి శుభాకాంక్షలు


Saturday 13 January 2018

భోగి శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు భోగ భాగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ...భోగి  పండుగ  శుభాకాంక్షలు.        అమిర్నేని హరికృష్ణ
🌹🌹🌹🌹🌹🌹🌹

Monday 8 January 2018

కొబ్బరిపీచు యూనిట్‌-ఆదాయఅవకాశాలు

కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగం తిరిగి మనకు ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ఖమ్మం తదితర కొబ్బరిని బాగా పండించే ప్రాంతాలలో కొబ్బరిపీచు తయారీ యూనిట్‌ను రైతు సంఘాల స్థాయిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాలపై రాసిన నా వ్యాసం జనవరి " అన్నదాత " వ్యవసాయ మాసపత్రికలో..!
                                                                    


సస్యలక్ష్మీ స్వాగతం

రైతుల పండుగ సంక్రాంతి శోభే వేరు. పల్లెసీమల్లో పంట నూర్పిళ్లు వేగం పుంజుకున్న ఈ తరుణంలో సస్యలక్ష్మిని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్రాలలో వరి సాగు స్థితిగతుల గురించి నేను రాసిన వ్యాసం జనవరి 2018 "అన్నదాత" వ్యవసాయ మాసపత్రిక లో..!
                                                                         


అన్నదాత మాసపత్రిక సరికొత్తగా...

                                                                           

దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన వ్యవసాయ మాసపత్రిక "అన్నదాత" జనవరి'18 సంచిక నుంచి రైతులు సరికొత్త మార్పులు చూడవచ్చు. పత్రిక స్వరూపంలో ఎన్నోమార్పులకు నవంబరు నుంచే శ్రీకారం చుట్టాం. అన్నదాత మాసపత్రిక రైతు సేవలో 49 ఏళ్లు నిండి 50 వ పడిలోకి చేరుకున్న సందర్భంగా పాఠకులకు, రైతులకు శుభాకాంక్షలు.