Pages

Thursday 28 May 2015

ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు

అవసరమైనది దొరకనప్పుడు అదే మనకు ప్రియం అవుతుందిఇజ్రాయెల్‌కు లేనిది నీరుఅదే అక్కడ అపురూపంఅపురూపమైన నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి చుక్కనీరు వృథా కాకుండా సమర్ధంగా వాడుకున్నారుజాతిగా తమకున్న అపార మేథోశక్తిని ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారువాటి సాయంతో ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారుఏదీ దొరకని చోట అన్నీ దొరికేలా చేసుకున్నారుఅన్నీ ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా నిలిచారునా ఇజ్రాయెల్‌ పర్యటనలో చూసిన అనుభవాలతో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు రాజకీయాలు మన రైతులకెంత శాపంగా పరిణమించాయో నాకు అర్ధమైందిఈ రెండు దేశాలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదేమిగతావన్నీ దీని తర్వాతే

భారత్ తో పోల్చితే  ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను
                                                                                 

Wednesday 13 May 2015

ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై కొన్ని కథనాలు

ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా నేను ఏకకాలంలో అటు ఈనాడుకు ఇటు ఈటీవీకి పనిచేయాల్సి వచ్చింది. చూసిన ఒక అంశంపై ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవడం అదే సమయంలో వారు వివరిస్తున్న సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బందులు ఎదురైనా., అవన్నీ తెలుసుకోవాలనే నా ఆసక్తి ముందు తేలిపోయాయి. ఈ పర్యటన సందర్బంగా ఈనాడుకు నేను రాసిన కథనాల క్లిప్పింగ్స్‌ను ఇక్కడ ఇస్తున్నాను. మరికొన్ని కథనాలు రాస్తున్నాను. మునుముందు వాటినీ ముఖపుస్తక మిత్రులకు అందిస్తాను. ఈటీవీలో 4వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై ఇదీసంగతిలో ఒక అరగంట ప్రత్యేక కార్యక్రమంతో పాటు మరికొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఇందుకు సహకరించిన ఈనాడు, ఈటీవీ సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని, కథనాలను చూసి ప్రశంసించిన మా గౌరవ ఛైర్మన్‌ రామోజీరావుకు వేనవేల కృతజ్ఞతలు.

Hari Krishna Amirneni's photo.

Wednesday 6 May 2015

సహచరుల ఆత్మీయత మరువలేను

ఇజ్రాయెల్‌ నుంచి రాగానే నా సహచర బృందం నాకో తీపి జ్ఞాపకాన్ని అందించింది. పాత్రికేయంలో మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆశీర్వదించింది. ఒక బాస్‌గా కాకుండా వారి బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తున్న ఒక శ్రేయోభిలాషిగా వారు నన్ను చూస్తున్న తీరు నాకు సంతోషానిచ్చింది. నా బృందంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా వందనాలు. మిత్రులారా మీ ఆత్మీయతను మరువలేను. మీ పట్ల నా బాధ్యతలను ఏ నాడూ మరచిపోను. అందరికీ ధన్యవాదాలు.
                                                             

Sunday 3 May 2015

ఆహార వృథా... ఆకలి వ్యథ

ఇజ్రాయెల్‌లో నాకిచ్చిన రోమింగ్‌కార్డు నన్ను తీవ్రంగా సతాయించింది. అందుకే ఏ పోస్టులూ పెట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత ముఖపుస్తకం ద్వారా మిత్రులతో మాట్లాడే అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్‌ పర్యటన నాకు మంచి విషయాలను వారి సాంకేతికత గొప్పదనాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది. వీటిని క్రోడీకరించి ఈటీవీలో ఇప్పటికే 4 కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఒక అరగంట సేపు ఇజ్రాయెల్‌ సాంకేతికతపై స్పెషల్‌ ఫీచర్‌ ఇస్తున్నాము. వీలైతే చూడండి. అలానే ఈనాడుకూ కథనాలు పంపిస్తున్నాను. అన్నట్టు ఆహార వృథా ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఇజ్రాయెల్‌ ప్రదర్శనపై ఈరోజు నేను రాసిన వ్యానం ఈనాడు ఎడిట్‌ పేజీలో వచ్చింది. చూడగలరు. మీ కోసం ఆ క్లిప్పింగ్‌ ఇక్కడ ఇస్తున్నాను.