Pages

Saturday 18 August 2018

గొర్రెల పెంపకం ప్రాజెక్టు రిపోర్టు

సేద్యానికి అనువుగా లేని ప్రాంతాలలో గొర్రెల పెంపకాన్ని వాణిజ్య సరళిలో చేపట్టడం లాభసాటి. పంటల సాగుకు అనుబంధంగా చేపట్టే ఇలాంటి వ్యాపకాల వల్ల రైతులు స్థిరమైన ఆదాయాలను అందుకోగలుగుతారు. ఒక వంద గొర్రెలతో పెంపకం చేపడితే వచ్చే ఆదాయ వ్యయాల ప్రాజెక్టు రిపోర్టుతో పాటు ఇతర వివరాలతో కూడిన వ్యాసాన్ని ఆగస్టు నెల "అన్నదాత" మాసపత్రిక ప్రచురించింది.
                                                                       


Monday 13 August 2018

నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి

నేలల్లో రకాలున్నా అందరూ పండించేది అదే నేలపై. కొందరు రైతులు తెలివిగా సేద్యంలో లాభాలు రాబట్టుకుంటుంటే., అధిక శాతం మంది కడగండ్లను ఎదుర్కొంటున్నారు. సేద్యంలో నైపుణ్యాలను పెంచుకుంటూ సేద్యాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంలా చేయగలుగుతున్న వాళ్లను విజయాలు వరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల చేయూత లోపం, మార్కెట్‌ శక్తుల ప్రాబల్యం ఇవన్నీ రైతుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి సాధ్యపడుతుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా చేపట్టి నైపుణ్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుతాయంటున్న నా వ్యాపాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.