Pages

Tuesday 23 September 2014

జయహో భారత్

                                                                             
ఇది నిజంగా చరిత్రే. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టిన మొదటి దేశంగా భారత్ నిలవటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయమిది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా., ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. జపాన్, చైనా వంటి దేశాలకు సాధ్యం కాని విజయాన్ని భారత్ నమోదు చేయటం ఈ విజయం ప్రత్యేకత. ఇస్రో సాధించిన ఈ విజయంతో ఇతర రంగాలు స్ఫూర్తి పొందాలి. అరుణ గ్రహంపై మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రవేశంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "ఇస్రో" శాస్రవేత్తలకు పేరు పేరునా అభినందనలు. భారతీయులకు శుభాకాంక్షలు. జయహో భారత్. 

Monday 8 September 2014

సిసలైన ప్రజాకవి కాళోజి

                                                                         
                             

ప్రజల హృదయాలకు బాసటగా నిలిచి అన్యాయంపై నిగ్గదీయటం తన జన్మహక్కని చాటిన గొప్ప మానవతావాది, ప్రజాస్వామ్య వాది ప్రజాకవి కాళోజి జయంతి నేడు. కన్నెర్ర చేసినా కన్నీళ్ళు పెట్టుకున్నా గుండె తడితో దుర్మార్గాలు, దమననీతిపై గుండెలవిసేలా పోరాడిన సిసలైన ప్రజాకవి కాళోజి శతజయంతి ఉత్సవాలకు ముగింపు సందర్భంగా ఆ మానవతావాదిని స్మరించుకునే సందర్భమిది. వ్యక్తి స్వాతంత్ర్యం కోసం ఉక్కుపిడికిలి భిగించి "నవయుగంబున నాజీవృత్తుల నగ్నసత్యమింకెన్నాళ్ళు.,   పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ బొందేదేన్నాళ్ళు.,      దమననీతితో దౌర్జన్యాలకు   దాగిలిమూతలు ఇంకెన్నాళ్ళు"  ....  అంటూ నిజాం పాలనలో పోలీసుల దౌర్జన్యంపై ప్రజాసమూహాలకు బాసటగా నిలిచి కలాన్ని ఆయుధంగా చేసి పోరాడిన ఉక్కుమనిషి మన కాళోజీ నారాయణరావు

అన్యాయాలకు వ్యతిరేకంగా గుండె చూపి పోరాడిన దీశాలి...
సిరాచుక్కలతో లక్షల మెదళ్లను కదిలించిన పోరాటశీలి....
జనం భాషతో జనపదాల్ని కదిలించిన కార్యశీలి...
స్వేచ్చాప్రియత్వం కోసం నిర్భీతితో పోరాడిన ప్రజాస్వామ్యవాదికిదే నా నివాళి!  

Thursday 4 September 2014

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దిక్చూచి

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంద్రను స్వర్ణాంద్రగా  మార్చే విషయంలోఈ రోజు ప్రకటించిన అంశాలు  కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అన్ని జిల్లాలకు సమదూరంలో విజయవాడ పరిసరాల్లో రాజధానిగా ప్రకటిస్తూ  అదే సమయంలో అన్ని జిల్లాల ప్రగతికి తాను చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాల గురించి  అసెంబ్లీలో ప్రకటించిన విధానం ఎంతో సమగ్రంగా ఉంది., రాయలసీమ లో రాజధాని పెట్టాలని, వైజాగ్ లో రాజధాని ప్రకటించాలని., కాదు, కాదు...  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రాజధాని ఉండాలని ఎవరికి వారు వాదించి సమయం వృధా చేసుకోకుండా కొత్త రాజధాని ప్రగతి కోసం ఏమేం చేయాలో వీలయితే తగిన సూచనలు ఇవ్వడం మంచిది. ఇప్పటికే జాతీయ విద్యాసంస్థలు ఎక్కడెక్కడ వస్తాయో ప్రభుత్వం ప్రకటించింది.  మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలను నిర్మించాలని నిర్ణయించారు.  వీటికి అదనంగా.. ఏయే జిల్లాల్లో ఏమేం పెట్టదలచుకున్నామో జిల్లాల వారీగా విపులంగా నోట్ విడుదల చేశారు.  
                                                                                 

నూతన పారిశ్రామిక నగరాల ఏర్పాటు.,కొత్త పోర్టుల ఏర్పాటు, పారిశ్రామికవాడలు, కొత్త విమానాశ్రయాలు, ఫుడ్ పార్క్ లు, ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ పార్క్ లు., గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పారిశ్రామిక నగరాలు, గిరిజన విశ్వవిద్యాలయం, సంగీతం, లలితకళల అకాడెమి ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం, ఇన్నోవేషన్, ఇన్కుబేషన్ హబ్, ఫుడ్ పార్క్, రైల్వే జోన్ లు., పెట్రోలియం యూనివర్సిటి, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్, నౌకా నిర్మాణ కేంద్రం, ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ, సిరామిక్ పరిశ్రమ, ఆయిల్ పామ్ పరిశ్రమ, జలమార్గాల అభివృద్ధి,  పోలవరం ప్రాజెక్ట్, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ లు, ఆయిల్ రిఫైనరీ, క్రాకర్ యూనిట్, మిస్సైల్ పార్క్, ఆటోమొబైల్ హబ్స్, ఎయిమ్స్. సౌర,విండ్  విధ్యుత్ కేంద్రాలు, టూరిజం సర్క్యూట్, థీం పార్క్ లు, ఎరువుల కర్మాగారాలు, హార్టీ కల్చర్ జోన్స్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విత్తనోత్పత్తి కేంద్రాలు, రైల్వే వ్యాగన్ వర్క్ షాప్స్, మైనింగ్ స్కూల్స్  వగైరాలతో కొత్త రాష్ట్ర అభివృద్ధికి పూనుకోవడం నిజంగా అభినందనీయం. ఇవన్నీ సాకారం కావాలని , ఆందుకు పాలకులు చిత్తశుద్ధి తో ప్రయత్నించాలని కోరుకుందాం.