Pages

Wednesday 17 October 2018

విజయ దశమి శుభాకాంక్షలు

ఈ విజయదశమి మీకు మీ కుటుంబ సభ్యులకు విజయాలను అందించాలని, సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటూ... దసరా శుభాకాంక్షలు. 

Thursday 11 October 2018

జేడీ లక్మీనారాయణ గారితో...

మైనింగ్ మాఫియాను గడ గడలాడించిన అప్పటి సీబీఐ దిగ్గజం  జెడి  లక్మీనారాయణ  గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి,  కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో రైతులతో సమావేశమవుతున్నారు.  రైతు సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ఆయన అధ్యయనం చేస్తున్నారు.   దీనిపై నా అనుభవాలను  తెలుసుకునేందుకు వారు నన్ను ఆహ్వానించారు.   వ్యవసాయరంగంపై నేను రాసిన వ్యాసాల్లోని  మంచి సూచనల్ని పలు సమావేశాల్లో  రైతులకు చదివి వినిపించాను అంటూ గతేడాది రాసిన కొన్ని వ్యాసాలను ఉటంకిస్తుంటే నాకు  ఆశ్చర్యం వేసింది.

రైతు సంక్షోభ నివారణకు ఒక ఫ్రెమ్ వర్క్ రూపొందిస్తున్న వారి నుంచి నిన్న సాయంత్రం ఊహించని రీతిలో ఒక చిరు సన్మానం. ధన్యవాదాలు సర్.
                               





Monday 8 October 2018

ఉపాధిగా కోళ్ల పరిశ్రమ

వ్యవసాయం అనుబంధ పరిశ్రమగా కోళ్ల పెంపకం చక్కని ఉపాధి మార్గం. కొన్ని దశాబ్దాలుగా రైతులు పెరటి కోళ్లు పెంచుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అది కాస్త నెమ్మదించినా సాగు ఆదాయం క్షీణించినప్పుడు పాడి-కోళ్లు,జీవాల నుంచి వచ్చే ఆదాయం స్ధిరంగా ఉంటూ రైతులకు చేయూతగా ఉండేది. వాణిజ్యసరళిలో కోళ్ల పెంపకానికి మంచి అవకాశాలున్న తరుణంలో నిరుద్యోగులు, రైతులు వాటిని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆదాయ, వ్యయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ వివరాల గురించి రాసిన నా వ్యాసాన్ని అక్టోబరు నెల అన్నదాత మాసపత్రికలో చూడవచ్చు