Pages

Wednesday 22 April 2015

ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

                                                       

ఇది నేను ఎంత మాత్రం ఊహించని ఆహ్వానం. అదీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం తనకు తాను నన్ను తన దేశానికి ఆహ్వానిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇదొక  గొప్ప విషయం అని నేను చెప్పటం లేదు కానీ.,  నాకు వృత్తి పరంగా సంతృప్తినిచ్చిన అంశం కాబట్టి మిత్రులతో పంచుకోవాలని అనిపించింది.
ఇజ్రాయెల్ లో ఈ నెల 27 నుంచి జరగనున్న ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన, సదస్సులో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్ నుంచి ఐదుగురు సీనియర్ జర్నలిస్టులను ఒక ప్రతినిధి బృందంగా తీసుకువెళుతోంది. ఈ డెలిగేషన్ లో నాతో పాటు కోల్ కతా నుంచి ఒకరు, ఏబీపీ ఛానల్ నుంచి ఒకరు, పీటీఐ నుంచి ఒకరు, దిల్లీ నుంచి మరొక జర్నలిస్ట్ ను తీసుకువెళుతున్నట్టు ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది.
22 ఏళ్ళ జర్నలిజం అనుభవంలో ఇది నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇన్నేళ్ళ జర్నలిజం లో రైతుల కోసం ప్రింటు మీడియాకు ఆర్టికల్స్ రాస్తూ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు.,  ఇజ్రాయెల్  ఆహ్వానం పలకడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్ళ నా జర్నలిజం ప్రయాణంలో నాకు వెన్నంటి నిలిచిన  మా చైర్మన్ రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, మా సీఈఓ బాపినీడు గారికి ఈ విషయం చెప్పగానే వెళ్ళిరమ్మని ప్రోత్సహించడం, అన్ని విధాలా సహకారం అందించడం సంతోషాన్నిచ్చింది. వారికి నా  కృతజ్ఞతలు. నా ఈ పర్యటనకు విశేషంగా తోడ్పడిన ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి అధ్యక్షులు కెన్ సాగర్ గారికి., సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.