Pages

Friday 19 August 2011

పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు అవార్డ్ అందుకున్నాను

                                                              
గురువారం సాయంత్రం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని FAAPCCI భవన్ లోని కే.ఎల్ .ఎన్. ప్రసాద్ ఆడిటోరియంలో రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా  పద్మశ్రీ  ఐ.వి.సుబ్బారావు పురస్కారాలను ప్రదానం  చేశారు. వ్యవసాయ జర్నలిజం విభాగంలో అయిదుగురు జర్నలిస్టులను ఎంపిక చేశారు. వారిలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో నన్ను ఎంపిక చేసి అవార్డును అందించారు. రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ కే. రోశయ్య చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. పద్మశ్రీ డాక్టర్ ఎం.వి. రావు,  హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ భవానిప్రసాద్, మాజీ ఎం.ఎల్.ఏ, రైతు నాయకుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి బుద్ధప్రసాద్, రైతు నాయకుడు అక్కినేని భవానిప్రసాద్, రైతునేస్తం ఎడిటర్ వై.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయిస్తున్న వ్యవసాయ మద్దతు ధరలు రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రోశయ్య గారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చట్టసభలకు ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు రైతు సమస్యల్ని గుర్తించకపోవడం దురదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రైతు నాయకుడు భవానిప్రసాద్ పార్టీలకు అతీతంగా నేతల తీరును కడిగి పారేశారు. ఈ  కార్యక్రమానికి సంబంధించిన వార్త 19 న  ఈనాడులో ప్రచురితమైంది. ఈ క్లిప్పింగ్ ఇక్కడ జత చేస్తున్నాను. 
                                                      

6 comments:

aarogyamastu said...

సర్... అవార్డు అందుకున్న శుభ సందర్భంలో మీకు నా అభినందనలు. భవిష్యత్తులో మీరు మరిన్ని అవార్డులు అందుకోవాలని మా ఆకాంక్ష.

uday said...

సర్..."రైతు నేస్తం" పురస్కారం అందుకున్న సందర్బంగా మా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు...మీరు మరెన్నొ పురస్కారాలు అందుకోవాలని మా ఆకాంక్ష....

Vinay Datta said...

Hearty Congratulations !

madhuri.

నాగరాజ్ said...

Dear Sir,

Let me wish you Hearty Congratulations on this great occasion!! We hope, many more memorable milestones are awaiting in your journey. Thank you so much.

-Nagaraj.

ravichand said...

Hearty Congratulations.......

అమిర్నేని హరికృష్ణ said...

మిత్రులందరికీ వందనాలు...

మనలో 90 శాతం మంది మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. వాటిని పరిరక్షించుకుందాం., మట్టి మనుషుల రుణం తీర్చుకుందాం. నేను చేస్తున్న కృషి వల్ల సగటు రైతుకు మేలు జరిగితే అదే నిజమైన అవార్డు. మీ అభిమానానికి వేనవేల కృతజ్ఞతలు.