Pages

Friday 18 May 2012

మేలుకొలుపు పాడాల్సిందేవరికి?

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిన పరిస్థితుల్లో కిరణ్ సర్కారు రైతు చైతన్య యాత్రలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో పంటల సాగు విధానాల పట్ల రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు  ఈ యాత్రలని అంటున్న సర్కారు సీజన్ ముంగిట రైతులపై మోయలేని భారం పడుతున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టలేకపోతోంది. పంటల సాగుకు  ఏం చేయాలో రైతుకు తెలిసిన పరిస్థితుల్లో వారికి కావలసింది ఆర్ధిక తోడ్పాటు మాత్రమె. వరుస నష్టాలతో ఇప్పటికే చితికిన రైతు బతుకులకు ఓదార్పు లభించాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు రైతుకు కల్పించాలి. దీనికి బిన్నంగా ఎరువులతో సహా అన్ని ఉత్పాదకాల ఖర్చులు లు పెరుగుతుంటే., ఉత్పత్తుల ధరలు పదే పదే పతనమై రైతుల్ని కలవరపెడుతున్నాయి. వీటిని సరిదిద్దాల్సిన పాలకుల్లో చైతన్యం లోపించినదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేసాను. 
                                                               

1 comment:

పూర్ణప్రజ్ఞాభారతి said...

ఓ పక్క మళ్లీ లేవకుండా నడ్డి విరగగొడుతూ మరో పక్క వాళ్లకేదో సాయం చేస్తున్నట్లు హడావిడి....సరైన కాలంలో సరైన పనిని సరైన పద్ధతిలో చెయ్యకపోవడం అంటే శత్రుత్వం వహించి దెబ్బతీయడం లాంటిదే. మందపాటి తోలు ఉన్న కాంగిరేయులకు ఈపాటి ఇంగితం కూడా ఉండదు. ఈ ముఖ్యమంత్రి, ఆయన అదుపులో (?) ఉండే మంత్రిగణం ఈషణ్మాత్రం వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్లకి ఎప్పటికీ ప్రాథమ్యాలు తెలుస్తాయో..