Pages

Friday 18 September 2020

ఇలాగేనా రైతుకు భరోసా?

నూటికి 29 శాతం మంది రైతులకే సంస్ధాగత పరపతి అందుతోంది. ఫలితంగా మిగిలిన 69 శాతం మంది రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవాలి. కాబట్టి తెచ్చిన పంటను వెంటనే అమ్మేసుకోవాలి. 86 శాతం సన్న, చిన్నకారు రైతులున్న దేశంలో వీరంతా పంటను నిల్వ చేసుకునే శక్తి లేనివారే కదా. మరి 69 శాతం మందికి కూడా సంస్ధాగత రుణాలిస్తే కనీసం వారు మంచి ధర కోసం వేచి చూస్తారు. కేంద్రం ఈ సంగతిని ఎలా విస్మరించిందిలో అర్ధం కావడం లేదు. అంటే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా తెచ్చిన ఈ వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత రాకుండా ఎలా ఉంటుంది? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.



No comments: