Pages

Monday 19 March 2018

లోపాలపుట్ట-పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ ముసాయిదా బిల్లు

పంటకు చీడపీడలు ఆశిస్తే ఏ మందును ఎంత మేరకు చల్లాలనేది 90 శాతం మంది రైతులకు తెలియదు. అది చెప్సాల్సిన విస్తరణ యంత్రాంగం ఉండదు. డీలర్లు ఏం ఇస్తే అది తెచ్చి చల్లుతున్నారు. వాళ్ల కమీషన్లు వాళ్లకు వస్తాయి. రైతు జేబులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా కేంద్రం రూపొందించిన "పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2017" ముసాయిదా సైతం లోపభూయిష్టంగా ఉంది. రెట్టింపు ఆదాయం రావాలంటే ముందు రైతులు ఖర్చులు తగ్గించుకోవాలి. రైతుల్ని ఉద్ధరిస్తామంటూ పాలకులు బడాయి ప్రకటనలు చేయడం తప్ప అన్నదాతకు మేలు చేసేలా చట్టాలకు పదును పెట్టకపోవడం వంటి చర్యలు వారి డొల్లతనాన్నిచెబుతున్నాయి. లోపాలపుట్టగా ఉన్న ఈ ముసాయిదా బిల్లు గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                      

Monday 5 March 2018

రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే..!

కేంద్రప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తోంది. అందుకు ముందుగా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాల్సి ఉంది. ఈ దిశగా కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదు. రైతు ఆదాయాం రెట్టింపు కావాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.