Pages

Monday 28 September 2020

గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

 గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం

గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీ కాట్) మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఒక జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ జీకాట్ సంస్ధ తొలిసారిగా గ్రామీణ రంగానికి సేవలందించిన పలువురికి "గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు" ప్రకటించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసి పురస్కారాన్ని అందించిన సంస్ధ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఢిల్లీ వసంత్, సిఈఓ శ్రవణ్, సీఓఓ సుబ్బరాజు, శ్రీకాంత్ , ఛైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డిలకు నా ధన్యవాదాలు.






Friday 18 September 2020

ఇలాగేనా రైతుకు భరోసా?

నూటికి 29 శాతం మంది రైతులకే సంస్ధాగత పరపతి అందుతోంది. ఫలితంగా మిగిలిన 69 శాతం మంది రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు తేవాలి. కాబట్టి తెచ్చిన పంటను వెంటనే అమ్మేసుకోవాలి. 86 శాతం సన్న, చిన్నకారు రైతులున్న దేశంలో వీరంతా పంటను నిల్వ చేసుకునే శక్తి లేనివారే కదా. మరి 69 శాతం మందికి కూడా సంస్ధాగత రుణాలిస్తే కనీసం వారు మంచి ధర కోసం వేచి చూస్తారు. కేంద్రం ఈ సంగతిని ఎలా విస్మరించిందిలో అర్ధం కావడం లేదు. అంటే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా తెచ్చిన ఈ వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత రాకుండా ఎలా ఉంటుంది? దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.



Friday 4 September 2020

బంతిపూల సాగు-లాభాల బాటలో మైసూరు రైతులు

 బంతిపూల సాగులో మైసూరు ప్రాంత రైతుల అనుభవాలపై రాసిన వ్యాసమిది. సమీపంలో విలువ జోడింపు పరిశ్రమలు ఏర్పాటైతే వచ్చే ప్రయోజనాలు రైతులకు ఎలా ఉంటాయనేది ఈ రైతులను చూస్తే అర్ధమవుతుంది. సెప్టెంబరు నెల అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైన వ్యాసం ఇది.




Wednesday 2 September 2020

అన్నదాత సంపాదకీయం

 అన్నదాత మాసపత్రిక సెప్టెంబరు 2020 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం.




ఇరుకు మనసులు

తెలుగు వెలుగు సెప్టెంబరు 2020 సంచికలో ప్రచురితమైన నా కవిత "ఇరుకు మనసులు"



Tuesday 1 September 2020

ఇంటి పంటతో ఆరోగ్యం

 రసాయన అవశేషాలు ఉన్న పండ్లు, కూరగాయలు తింటూ మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. మనకున్న పరిధిలో ఇంటి చుట్టుపక్కల, అపార్టుమెంటు బాల్కనీలు, మిద్దెలపై కాస్త శ్రద్ధ చూపి ఇంటి పంటలు పెంచుకుంటే చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.