Pages

Saturday 24 April 2021

ఆహారశుద్ధితోనే ఆదాయవృద్ధి

 ఉత్పత్తి కి విలువ జోడించే కొద్దీ రైతులకు ఆదాయం పెరుగుతుంది.  దేశంలో ఆహారశుద్ధి పరిశ్రమలను గ్రామ స్థాయికి విస్తరిస్తే రైతులకు స్థిరమైన ఆదాయాలు దక్కుతాయంటూ నేను రాసిన వ్యాసాన్ని. ఈనాడు ప్రచురించింది. 


Monday 12 April 2021

ఉగాది శుభాకాంక్షలు

 🌹మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ సంవత్సర


ఉగాది శుభాకాంక్షలు. మీరు,  మీ కుటుంబసభ్యులందరూ ఆయురారోగ్యాలతో, శాంతి, సౌభాగ్యాలతో తులతూగాలని ఆశిస్తున్నాను.🌹

Thursday 8 April 2021

రైతులంటే అంత చులకనా..?

క్వింటా వరి ధాన్యం పండించేందుకు దాదాపు రూ. 2600 ఖర్చవుతోంది. ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ. 1880 మాత్రమే. నిజానికి ఆ ధరా దక్కదు. ముడి సరుకుల ధరలు పెరిగాయని డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) ధరల్ని ఏకంగా బస్తాకు రూ. 1200 నుంచి 1900 కి (ఒకేసారి రూ. 700) పెంచేసి కంపెనీలకు మేలు చేస్తున్న కేంద్రం, బస్తా ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టు మద్దతు ధరలను ఎందుకు పెంచలేకపోతోంది..?
డీజిల్, పెట్రోలు, డిఏపీ, ఇతర ఉత్పాదకాల ధరలు పెంచుతున్నా రైతుకు మాత్రం ఏటా పదో, పాతికో పెంచి ముష్టి వేస్తున్నారా..? కంపెనీలకో న్యాయం..? రైతులకు అన్యాయమా....? ఇదేం చోద్యం. అన్నదాతలంటే అంత చులకనా..?
 




Wednesday 7 April 2021

వంటనూనెల్లో స్వయం సమృద్ధి ఇంకెన్నాళ్లు!

వంటనూనెల ధరలు మండుతున్న నేపథ్యంలో నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచే దిశగా స్వయం సమృద్ధి సాధించేందుు పటిష్ట కార్యాచరణను రూపొందించాల్సన అవసరాన్ని గుర్తు చేస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.



Thursday 1 April 2021

విటమిన్లు ఇచ్చే అన్నం

వరి, గోధుమల్లో విటమిన్ డి, ఎ, సి లు లభించేలా పోషకాలను పెంపొందించే మిశ్రమాన్ని రూపొందించి, పేటెంట్ కూడా పొందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కృషి గురించి నేను రాసిన వ్యాసం.. అన్నదాత మాసపత్రిక ఏప్రిల్ 2021 సంచికలో