Pages

Thursday 8 April 2021

రైతులంటే అంత చులకనా..?

క్వింటా వరి ధాన్యం పండించేందుకు దాదాపు రూ. 2600 ఖర్చవుతోంది. ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ. 1880 మాత్రమే. నిజానికి ఆ ధరా దక్కదు. ముడి సరుకుల ధరలు పెరిగాయని డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) ధరల్ని ఏకంగా బస్తాకు రూ. 1200 నుంచి 1900 కి (ఒకేసారి రూ. 700) పెంచేసి కంపెనీలకు మేలు చేస్తున్న కేంద్రం, బస్తా ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టు మద్దతు ధరలను ఎందుకు పెంచలేకపోతోంది..?
డీజిల్, పెట్రోలు, డిఏపీ, ఇతర ఉత్పాదకాల ధరలు పెంచుతున్నా రైతుకు మాత్రం ఏటా పదో, పాతికో పెంచి ముష్టి వేస్తున్నారా..? కంపెనీలకో న్యాయం..? రైతులకు అన్యాయమా....? ఇదేం చోద్యం. అన్నదాతలంటే అంత చులకనా..?
 




No comments: