Pages

Thursday 28 February 2013

నిరాశ పరచిన చిదంబరం

                                                              
భారీ అంకెల తిరగమోతగానే యూపీఏ-2 చివరి సంపూర్ణ బడ్జెట్ ను చిదంబరం మహా ఘనంగానే వండి వార్చారు. పన్నుల సంస్కరణల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ను ప్రకటించిన చిదంబరం .. జన సామాన్యం పై వడ్డన భారం పొంచే ఉందని పరోక్షంగా చెప్పారు. గత ఏడాది ఏడాది కంటే 22 శాతం పెంచి వ్యవసాయరంగానికి 27 వేల 49 కోట్లు కేటాయించారు. అలానే ఏడు లక్షల కోట్ల రైతు రుణాల లక్ష్యంలో మంజూరయ్యేది ఎంతన్నదే అసలు ప్రశ్న! రైతుల భధ్రతకు భరోసా ఇవ్వకుండా ఆహార భధ్రత కు సైతం పెద్దగా కేటాయింపులు లేకుండా చిదంబరం బడ్జెట్ చాలా చప్పగా ఉంది. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే ..... అటు ఎన్నికల ఊసులు ఎక్కువగా లేకుండా ఇటు సంక్షేమం ఆశలు వెల్లివిరియకుండా ఎవరినీ పెద్దగా సంతృప్తి పరచకుండానే సాగిన బడ్జెట్ ఇది. 

Monday 25 February 2013

బడ్జెట్లలో వ్యవ'సాయం' అంతంత మాత్రమే!

ఏళ్ళు గడుస్తున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆహారభద్రత గురించి గొంతు చించుకుంటున్న యూపీఏ ప్రభుత్వం దీనికి మూలమైన వ్యవసాయ రంగ అభివృద్ధిని విస్మరిస్తోంది.  సాగులో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాలంటే రైతుకు చేయూత అవసరం. అందుకు తగిన సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. ఇవేమీ చేయకుండానే వ్యవసాయం బాగున్నట్టు ఆహార భద్రత కల్పించేస్తామంటూ కేంద్రం ప్రజల్ని మభ్య పెడుతోంది. దశాభ్దాలుగా సేద్యరంగాన్ని  నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతుల పరిస్థితి దిగజారింది. ముందు రైతుల్ని నిలబెట్టే చర్యలకు ఉపక్రమించకుండా  బడ్జెట్లలో కేంద్రం వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపుతూ వచ్చింది. 28న కేంద్రం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండాలి ? రైతుల పరిస్థితి మెరుగు పడాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.     
                                                                 

Tuesday 12 February 2013

ఉత్పాద'కత' మారేదేలా?

వ్యవసాయంలో దేశం ఎంతో పురోగమించింది అన్నది తిరుగులేని వాస్తవం. మరి మన రైతులెందుకు చితికిపోతున్నారు..?  అన్ని వర్గాల ప్రజలు జీవితంలో ఎంతో కొంత ప్రగతి సాధిస్తే., రైతుల పరిస్థితే  ఎందుకని దిగజారుతోంది.. ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక పోతున్నాయి. రైతు శ్రేయం కాపాడే విషయంలో చేతకానివిగా మిగిలిపోతున్నాయి. రైతుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రభుత్వాలకు తెలిసినా అవి అందించే విషయంలో ఆడ్డుపడుతున్న శక్తులను నియంత్రించలేని తీరు వల్ల అన్నదాతలు సేద్యంలో చితికిపోతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే.., హెక్టారు సగటు ఉత్పాదకతలో ఆశించిన పురోగతి లేక రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. కాయకష్టం చేసి సిరులు పండిస్తున్నా రైతుల పరిస్థితి దయనీయంగా ఉండటానికి దారితీస్తున్న  కారణాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.