Pages

Friday 21 May 2021

రైతుకు ధరల భారం

 పెట్రో, ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో ఖరీఫ్ ముంగిట రైతులకు పెనుభారం కానుంది.  అధిక ఎరువుల వాడకాన్ని రైతులు తగ్గించుకోవడంతో పాటు సాగు వ్యయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మద్దతు ధరాలను పెంచాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 



Thursday 6 May 2021

ఆర్.ఎ.ఎస్ పద్ధతిలో చేపల పెంపకం

రీసర్క్యులేటింగ్ ఆక్వా సిస్టమ్ (ఆర్.ఎ.ఎస్) పద్ధతిని ఆచరించి పలువురు రైతులు చేపల పెంపకంలో ఆశించిన లాభాలను పొందలేకపోయారు. ఇజ్రాయెల్, జర్మనీ, చైనా తదితర దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతి అధిక ఖర్చుతో కూడినదవడం, సాంకేతికతను సక్రమంగా అర్ధం చేసుకోలేకపోవడం,  లోపభూయిష్టమైన నిర్వహణ విధానాలను అనుసరించడం వల్లనే రైతులు నష్టపోతున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే ఈ పద్ధతిలో చేపల పెంపకాన్ని సక్రమంగా చేపడితే భారీ లాభాలు పొందవచ్చంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మే 2021 సంచిక ప్రచురించింది.





Sunday 2 May 2021

Saturday 1 May 2021

కష్టానికి నష్టమే ఫలమా ?

 సేద్యంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతుల లాభాలను హరించి వేస్తున్నాయి. విస్తరణ సేవలు అందని  నేపధ్యంలో సాగు ప్రతి దశలో ఖర్చులు తగ్గించుకోవడమే రైతుల ముందున్న ప్రత్యామ్నాయం అంటూ నేను రాసిన వ్యాసాన్ని. ఈనాడు ఈ రోజు ప్రచురించింది.