Pages

Saturday 8 June 2019

సేంద్రియ, సమగ్ర వ్యవసాయ క్షేత్రం

నా పాతికేళ్ల వ్యవసాయ పాత్రికేయ ప్రయాణంలో  ఇంత వైవిధ్యం ఉన్న తోటను నేను చూడటం ఇదే తొలిసారి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట గ్రామంలో ఉన్న ఈ అటల్ బిహారీ వాజపేయి ఉద్యాన క్షేత్రం సుఖవాసి హరిబాబు గారిది. కేవలం పదేకరాల్లో వందకు పైగా దేశ, విదేశీ పండ్ల చెట్లతో పాటు 10 వేల మొక్కలు, చేపలు, కోళ్లు, జీవాలు, పశువులతో సమగ్ర వ్యవసాయానికి సిసలైన చిరునామాగా నిలుస్తోన్న ఈ సేంద్రియ , ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ను చూసి తీరాల్సిందే. హేట్సాఫ్  హరిబాబు గారు.








Wednesday 5 June 2019

రుణాల అందుబాటే రైతుకు పెను సమస్య!

దేశంలో నూటికి 70 శాతం మంది రైతులకు సంస్థాగతంగా పంట రుణాలు అందడం లేదు. సేద్యంలో ఎన్నో ఇబ్బందులకు మూలమైన రుణ సమస్యపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక  జూన్ సంచికలో ప్రచురితమైంది.


Monday 3 June 2019

అన్నదాత మాసపత్రిక జూన్‌ సంపాదకీయం

అన్నదాత మాసపత్రిక జూన్‌, 2019 సంచిక కవర్‌పేజి, సంపాదకీయం.
                                                                       

Sunday 2 June 2019

సేంద్రియ సేద్యంతో సిరులు

నేలలు, మానవారోగ్యాన్ని కాపాడుకోవాలంటే  సేంద్రియ వ్యవసాయ విధానాలే శరణ్యం. అయితే వీటికి ధ్రువీకరణ తో పాటు ప్రత్యేక ధరలు ప్రకటించి ప్రత్యేక మార్కెటింగ్ ను కల్పించాలిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.