Pages

Friday 8 December 2023

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ

 థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ

అవును ఈనాడులో నా ఉద్యోగ జీవితానికి నేటితో మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. 1993లో ఇదే రోజు ఉపసంపాదకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన నాకు ఈనాడు సంస్ధ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఈటీవీ వార్తా ఛానళ్లకు ప్రోగ్రామింగ్‌ హెడ్‌గా,  ఓం సిటీ హెడ్‌గా, రామోజీ మల్టీ మీడియా ఛానల్స్‌ (ఆర్‌ఎంఎం)కు నేషనల్‌ హెడ్‌గా (ఓంసిటీ, ఆర్‌ఎంఎం లు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయనుకోండి) అన్నదాత సంపాదకునిగా  నేడు ఈటీవీ లైఫ్‌ ఆధ్మాత్మిక ఛానల్‌కు హెడ్‌గా నా ఈ ప్రస్థానం అంతా ఈనాడు యాజమాన్యం చలవే. నా ప్రతి అడుగులో సహకరించిన సహచరులు, నాకు అండగా నిలిచిన మా ఛైర్మన్‌ రామోజీరావు గారికి, ఎండి కిరణ్‌ గారికి, సిఈఓ బాపినీడుగారికి, గోపాలరావు గారికి నా మనఃపూర్వక ధన్యవాదములు.



Thursday 28 September 2023

రైతు బాంధవుల మృతి తీరని లోటు










రైతు బాంధవుల మృతి తీరని లోటు 

దేశ వ్యవసాయ విప్లవానికి దిశానిర్ధేశం చేసిన భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ గారి మృతి దేశ రైతాంగానికి తీరని లోటు. అత్యున్నత వ్యవసాయ పరిశోధనలను గ్రామీణ రైతులకు చేరేలా., ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక సాగు సాంకేతికతను భారత రైతులకు తెలిసేలా వ్యవసాయ విధానాల రూపకల్పనకు సాయపడిన మహా మనిషి స్వామినాథన్‌గారు.  అన్నదాత కార్వనిర్వాహక సంపాదకునిగా  2019 జనవరిలో స్వర్ణోత్సవ సంచికకు వీరితో ప్రత్యేక వ్యాసం రాయించడం నేను మర్చిపోలేని జ్ఞాపకం. 

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అపార సేవలు అందించిన నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ చెరుకూరి వీరయ్యగారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం నుంచి పోలవరం వరకు సాగు నీటి ప్రాజెక్టులు, రైతుల సాగునీటి సమస్యలపై అవిశ్రాంతి కృషి చేశారు. 

కౌలు రైతుల శ్రేయం కోసం, బచావత్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులు,  కృష్ణా డెల్టా రైతుల నీటి సమస్యలు , సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ గారు...  వీరు ముగ్గురూ  24 గంటల తేడాతో చనిపోవడం రైతు లోకానికి పెను దుఃఖం కలిగిస్తోంది. పాతికేళ్లుగా వీరితో అనుబంధం మరువలేనిది.  రైతుల కోసం నిస్వార్ధంగా చేసిన వారి కృషి అనన్యసామాన్యం. తమ తమ పరిధిలో  రైతు శ్రేయం కోసం అలుపెరుగని కృషి చేసిన ఈ ముగ్గురికి నా నివాళులు. 🙏🙏🙏


Sunday 17 September 2023

వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు.. మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు💐💐



Monday 21 August 2023

వంశీ వాసిరెడ్డికి శుభాకాంక్షలు

 



ఒక్కరుగా పొందలేనిది సమష్టిగా సాధించగలమనే సహకార సూత్రం ఆధారంగా ఏర్పడుతున్నవే నేటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌.పి.)లు. విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు పనిముట్లు, యంత్రాలు సహా వ్యవసాయ ఉత్పాదకాలను నేరుగా వాటిని ఉత్పత్తి చేసే సంస్ధల నుంచి నాణ్యమైనవి పొందడం వల్ల సేద్యంలో సంభవించే 20-30 శాతం పంట నష్టాలను కూడా నివారించుకోవచ్చు. పైగా ఈ సంఘాలకు బ్యాంకర్లు నేరుగా రుణాలందిస్తే వాటి వసూలు కూడా నూరు శాతం ఉంటుంది. ఎఫ్‌.పి.ఓల ఏర్పాటుతో రైతుల మధ్య సంఘటిత్వం ఉండి మంచి ధరకు పంటను సమష్టిగా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించుకోగలడం, ఉత్పత్తికి ప్రాసెసింగ్‌ చేసుకోవడం వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశముంది. గత పదేళ్లుగా వీటి ఏర్పాటుకు నా ప్రతి వ్యాసంలో రైతులు ఇటువంటి సంఘాలుగా ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి చెబుతూ వస్తున్నా.

మిత్రుడు వంశీకృష్ణ వాసిరెడ్డి ఎఫ్‌.పి.ఓ ఏర్పాటు చేస్తున్నా అన్నా అనగానే ఎంతో సంతోషించాను. కొంత కాలంగా ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించి పున్నవల్లి (ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ దగ్గర) చుట్టుపక్కల గ్రామాల రైతులకు తన ఆలోచనలు చెప్పి "పున్నవల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌" ప్రారంభోత్సవానికి రేపు శ్రీకారం చుట్టాడు. తనకు విజయోస్తు. మిత్రులు సిబిఐ విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణ గారు దీన్ని ప్రారంభించనున్న శుభసందర్భంలో వంశీ బృందానికి నా హార్ధిక శుభాకాంక్షలు.


Saturday 15 July 2023

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసo  ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.