Saturday, 29 February 2020
Thursday, 20 February 2020
మట్టి లోగుట్టు విప్పిన రైతు శాస్త్రవేత్త వెంకటరెడ్డి
"ద్రాక్షరత్న" చింతల వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన తర్వాత వారితో కలిసి కీసరలో ఉన్న వారి ద్రాక్ష తోటలో. నేల లోపలి మట్టిని తీసి ఎండబెట్టి పంట చేలకు పై మట్టిగా వాడితే ఎలాంటి ఎరువులు చల్లాల్సిన అవసరం లేదన్నది ఆయన మాత్రమే కనిపెట్టిన గొప్ప ఆవిష్కరణ. దీనికి పేటెంట్ కూడా దక్కించుకుని సుప్రసిద్ధుడైన చింతల వెంకటరెడ్డిని కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వారితో నిర్వహించిన "చెప్పాలని ఉంది" కార్యక్రమం ఈ శనివారం (22-2-2020 ) ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానళ్లలో రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గంటలకు (పునఃప్రసారం) ప్రసారమవుతుంది. తప్పక చూడండి.
ఈ సందర్భంగా వారితో నిర్వహించిన "చెప్పాలని ఉంది" కార్యక్రమం ఈ శనివారం (22-2-2020 ) ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానళ్లలో రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గంటలకు (పునఃప్రసారం) ప్రసారమవుతుంది. తప్పక చూడండి.
Sunday, 16 February 2020
Monday, 10 February 2020
ఆహార నాణ్యతే పెనుసవాలు
పంటలపై పరిమితికి మించిన విషరసాయనాల అవశేషాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో మన ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సేంద్రియ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించడం, వీటిపై రైతుల్లో అవగాహన కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరముంది. ఈ విషయంలో మహారాష్ట్ర ఎంతో చొరవ చూపుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 7 February 2020
ఒకనాటి కూలీ.. నేడు కార్పొరేట్ రైతు
కోడిగుడ్లు, కొవ్వొత్తులు అమ్ముకుంటూ రైతు కూలీగా విదేశాలకు వెళ్లి వేల కోట్లు ఆర్జించి వేలాది ఎకరాల ఎస్టేట్లను సొంతం చేసుకున్న వ్యక్తి హైదరాబాదీ సిరిగిరి రవీందర్ స్ఫూర్తి గాధ ఇది. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరు నభూతోః అనిపించక మానదు. బాగా సంపాదించాలనే కసి., అలుపెరుగని శ్రమతో అతను అందుకున్న విజయాలపై నేను రాసిన వ్యాసాన్ని ఫిబ్రవరి 2020 అన్నదాత మాసపత్రిక ప్రచురించింది.
Tuesday, 4 February 2020
Subscribe to:
Posts (Atom)