Pages

Thursday, 20 February 2020

మట్టి లోగుట్టు విప్పిన రైతు శాస్త్రవేత్త వెంకటరెడ్డి

"ద్రాక్షరత్న" చింతల వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన తర్వాత వారితో కలిసి కీసరలో ఉన్న వారి ద్రాక్ష తోటలో. నేల లోపలి మట్టిని తీసి ఎండబెట్టి పంట చేలకు పై మట్టిగా వాడితే ఎలాంటి ఎరువులు చల్లాల్సిన అవసరం లేదన్నది ఆయన మాత్రమే కనిపెట్టిన గొప్ప ఆవిష్కరణ. దీనికి పేటెంట్ కూడా దక్కించుకుని సుప్రసిద్ధుడైన చింతల వెంకటరెడ్డిని కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వారితో నిర్వహించిన "చెప్పాలని ఉంది" కార్యక్రమం ఈ శనివారం (22-2-2020 ) ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానళ్లలో రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గంటలకు (పునఃప్రసారం) ప్రసారమవుతుంది. తప్పక చూడండి.