రైతు
చేలో తన ఉత్పత్తిని కిలో రూ.
10కి విక్రయిస్తే
అది బహిరంగ విపణిలో రూ.
100 పలుకుతోంది.
ఐదారు నెలల
రైతు కష్టాన్ని వ్యాపారి
ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు.
స్వాతంత్ర్యం
వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో
రైతుల ఈ దుస్థితిని సరిచేయలేని
పాలకులది ఘోర వైఫల్యం.
ప్రభుత్వాలేదో
చేస్తాయనే భ్రమలు రైతుకు
లేనందువల్ల రైతులు ఐక్యంగా
లేదా ఒక్కరుగా కుటీర పరిశ్రమ
స్థాయిలో తమ ఉత్పత్తికి విలువ
జోడించుకోగలిగితే రెట్టింపు
ఆదాయాలు దక్కుతాయి.
రైతులిలా
మార్కెట్ నైపుణ్యాన్ని
పెంచుకోవాలని సూచిస్తున్న
నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది.
Saturday, 11 November 2017
Friday, 3 November 2017
రైతుస్థాయిలో జీడిప్రాసెసింగ్
జీడిపప్పును ప్రాసెస్ చేసే క్రమంలో రైతులు, కార్మికులు కొన్నేళ్ల క్రితం వరకు తీవ్ర కాలుష్యంతో అనారోగ్యం పాలయ్యేవారు. స్టీమ్ బాయిలర్లు వచ్చాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కానీ రైతు స్థాయిలో ముఖ్యంగా కుటీర పరిశ్రమల వారు చాలా మంది జీడిమామిడి ప్రాసెసింగ్‌లో సంప్రదాయ పద్ధతైన డ్రమ్ రోస్టింగ్ పద్ధతినే అనుసరిస్తున్నారు. యాంత్రీకరణ రైతుస్థాయిలో విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ అందుకు చిన్న రైతులకు యంత్రాల ఖరీదు, వాటి లభ్యత గురించిన సమాచారాన్ని ఈ నెల అన్నదాత మాసపత్రికలో వచ్చిన నా వ్యాసం ద్వారా అందించాను.
పత్తి మార్కెట్ సమీక్ష
పత్తి పంట మార్కెట్లకు వస్తోంది. తేమ శాతం సాకుగా చూపి వ్యాపారులు రైతుల్ని దోచుకుంటున్నారు. కేంద్ర పత్తి సంస్ధ (సిసిఐ) పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు అంతర్జాతీయంగా పత్తి మార్కెట్లలో ధరల పోకడలు ఎలా ఉన్నాయి., ఫ్యూచర్స్ ధరల్లో కదలికలు., నాణ్యమైన పత్తికి కనీస మద్ధతు ధర కంటే ధర ఎక్కువ పలుకుతుందా., తగ్గుతుందా అన్న విషయాలను సమీక్షిస్తూ ఈ నెల అన్నదాత మాసపత్రికలో రాసిన నా వ్యాసమిది.
తేనెటీగల యూనిట్‌తో అదనపు ఆదాయం
సేద్యం లాభసాటి కాని పరిస్థితుల్లో రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను
ఆచరించాల్సిన అవసరముంది. వ్యవసాయంతో పాటు పశుపోషణ, పట్టు, కోళ్ల పెంపకం,
తేనెటీగల పెంపకాన్ని చేపట్టగలిగితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు
స్ధిరమైన ఆదాయాలను అందుకోవచ్చు. నవంబరు అన్నదాత మాసపత్రికలో విజయరాయి
పరిశోధన కేంద్రం (ప.గో) సహకారంతో తేనెటీగల యూనిట్ ఏర్పాటుతో రైతులకున్న
అదనపు ఆదాయ అవకాశాల గురించిన వ్యాసం అందించాను.
Wednesday, 1 November 2017
"అన్నదాత" సారథ్యం

Subscribe to:
Posts (Atom)