Pages

Wednesday 18 April 2012

ధర లేక పసుపు రైతుల దైన్యం!

                                                           
ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 90 శాతం ఆక్రమించిన భారత్ లో ఆ పంట పండిస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. అర్ధం పర్ధం లేని ఎగుమతి దిగుమతి విధానాలతో కేంద్రం రైతుల ప్రయోజనాలను కాలరాస్తోంది. ఎగుమతుల నిషేధంతో దేశీయ రైతులు ధర లేక ఈ ఏడాది భారీ నష్టాలు పొందాల్సి వచ్చింది. వీటికి తోడు వ్యాపారుల మోసాలతో ఉన్న ధర కూడా రైతులకు  అందటం లేదు. పత్తి ఎగుమతుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని తర్వాత సవరించుకున్న కేంద్రం అదే తప్పును పసుపు విషయంలోనూ పునరావృతం చేసింది. కేంద్ర రాష్ట్రాలు లోపభూయిష్టమైన విధానాలతో రైతుల ప్రయోజనాలు దెబ్బ తీస్తున్న తీరు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోంది. ధరలు పతనమవుతున్న తరుణంలో కనీసం ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మంచి ధరలు అందేలా చూడాల్సిన పరిస్థితుల్లో సర్కారీ నిర్లక్ష్యం క్షమించరానిది. 

2 comments:

keshav said...

మీ ఆడియో సీడీ రిలీజ్ అయినందుకు ఆనందంగా ఉంది సర్.... శుభాకాంక్షలు...
మీ
కేశవ్

Hari Krishna said...

Dear Kesav
Thank you so much.
Yours
Harikrishna