Pages

Thursday 29 December 2011

లోక్ పాల్ పై ఇంతవంచనా ..?


అవినీతిపై సమర శంఖం పూరిస్తామని లోక్ పాల్ బిల్లు తెచ్చి తీరుతామని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ బొక్కబోర్లా పడింది. అవినీతి వ్యతిరేక బిల్లును నిరోదించే విషయంలో రాజకీయ పక్షాలన్నీ ఏకం కావడం వారి దుర్నీతిని తేటతెల్లం చేసింది. లోక్ సభలో హైడ్రామా మధ్య ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లును గట్టేక్కించడంలో అధికార కాంగ్రెస్ తన భాగస్వామ్యపక్షాలను ఒప్పించలేకపోయింది. రాజ్య సభలో సుదీర్ఘ చర్చ సమయంలో విపక్షాల నిలదీతతో అధికార కాంగ్రెస్ లోక్ పాల్ పై వెనకడుగు వేయటం సిగ్గుచేటు. నాలుగున్నర్ర దశాబ్దాల లోక్ పాల్ బిల్లుకు నేటికీ ఆమోదం పొందలేకపోవడం అవినీతిని తుదముట్టించడంలో నేతలకున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్ధమవుతోంది. పార్టీలను ఒప్పించడంలో సర్కారు విఫలం కావడం వల్ల నాటకీయ పరిణామాల మధ్య లోక్ పాల్ బిల్లుకు గ్రహణం పట్టింది. అవినీతిని తుదముట్టించే బిల్లు అన్నా హజారే చెప్పినట్టు కాకుండా ఇలా ఉండాలంటూ తమ సొంత సూత్రీకరణలు చేసిన పార్టీలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించి  బిల్లును శక్తిహీనం చేశాయి. పార్టీలన్నీ అవినీతి బురదలోనే తాము పోర్లాడతామని మరోసారి రుజువు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. స్కాంలతోనే సహవాసం చేస్తామని నిరూపించాయి. హజారేలు ఎందరు వచ్చినా, నిజంగా ఆ గాంధీయే తిరిగి జన్మించినా నేటి రాజకీయ నేతల బుద్దిని మార్చలేం. ఏమంటారు?

2 comments:

♛ ప్రిన్స్ ♛ said...

మాన నాయకులకు ___ లేదు ఉంది ఉంటె లోక్ పాల్ బిల్ కోసం ఇంత స్టొరీ నడవదు జనాలకు మంచి జరుగుతుంది అవినీతి తగ్గుతుంది అని తెలిసినప్పుడు వేరే ఆలోచన లేకుంట పాస్ చేయాలి ఒక విషయం ఏమిటి అంటే ఒక్కడుకుడా నీతి గల నాయకులు లేరు అని వాళ్ళే డొల్ వాయించి చెపుకుంట్టున్నారు

Praveen Mandangi said...

అవినీతిపరుల నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేస్తుందంటే అన్నా హజారే ఎలా నమ్మినట్టు? సమాజ ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ప్రధానం అని నమ్మే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకులు తమ వ్యక్తిగత ప్రయోజనాలకి విరుద్ధమైన చట్టాలు తయారు చేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్ళు విసిరి వ్యక్తిగత పబ్లిసిటీ పొందుదామనే అన్నా హజారే ఉద్యమం నడిపినట్టు ఉన్నాడు. లోక్‌పాల్ బిల్‌ని శక్తిహీనం చెయ్యడంలో పార్టీలన్నీ ఒకటే. కానీ ఇందులో అన్నా హజారే తప్పు కూడా లేదంటారా? సమాజం మారకుండా కేవలం ఒక సమూహం నడిపే ఆందోళనల వల్ల మార్పు వచ్చేస్తుంది అని నమ్మాడు. తెలంగాణా అంశం కానీ, ఇంకో అంశం కానీ ఇలా వివిధ అంశాలలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉండదు. కానీ అవినీతి వ్యతిరేక బిల్‌ని బలహీనపరిచే విషయంలో అన్ని పార్టీలు ఒకే అజెండా మీద ఉంటాయి.