Pages

Monday, 14 September 2015

ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                           


Sunday, 30 August 2015

పేదింట్లో ఉడకని పప్పులు!

                                                               
కిలో కందిపప్పు రూ.150., కిలో మినపగుండ్లు రూ.140.,సామాన్యుడికి పోషకాహారాన్ని అందించే పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంటే ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో ఉందనేది ఏలినవారి మాట. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ధరల మధ్య సమన్వయం సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా దిగుమతులతో చేతిచమురు వదిలించుకుంటోందే తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న మెట్ట రైతులకు చేయూతను అందించడం లేదని విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్‌ లోడ్‌ చేస్తున్నాను
                                                                                 
                                                                      



Wednesday, 22 July 2015

విపత్తుల నుంచి రైతుకు రక్షణేదీ?

ఎటువంటి విధానాలు అమలు చేస్తే రైతులు స్థిరమైన ఆదాయం పొందుతారనే విషయం పాలకులకు తెలియనిదేమీ కాదు. ఇప్పడు పంట నష్టపోతే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి కానీ పరిహారం (అసలు వస్తుందన్న గ్యారంటీ లేదు) చేతికందటం లేదు. మన రైతులు పంట చేలో కలుపు మొక్కలు ఏరుతున్నారు కానీ, ఈ దేశ "రాజకీయాలకు పట్టిన చీడల్ని" వదిలించడంపై దృష్టి పెట్టి ఉంటే వారి పరిస్థితులు ఈ పాటికి బాగుపడేవేమో..! ఏమంటారు? పంటల బీమా పథకం లోని లొసుగుల్ని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ క్లిప్పింగ్‌....

                                                                    


Wednesday, 1 July 2015

ఇజ్రాయెల్‌ వ్యవసాయం పార్ట్‌-2

జూలై నెల అన్నదాత మాసపత్రికలో ఇజ్రాయెల్‌ వ్యవసాయంగంపై నేను పరిశీలించిన అనుభవాల గురించి రాసిన వ్యాసం రెండో భాగం ప్రచురితమైంది. వాటిని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను
                                                                   








Monday, 29 June 2015

బలిపీఠంపై రైతులు

వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వ్యవసాయం ఒక దండుగ మారి వ్యాపకంగా మారింది. వరుస నష్టాలు వస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారి ఒడ్డునపడతామన్న గుడ్డినమ్మకంతో సేద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే., కొండల్లా పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రభుత్వాల తోడ్పాటు లేక మరికొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, పరిష్కారాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను.
                                                           
         



Tuesday, 2 June 2015

ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌"

వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్‌ సాధించిన ప్రగతి గురించి నేను రాసిన ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌" మొదటి భాగాన్ని సచిత్రాలతో సవివరంగా ఇచ్చారు. మీ కోసం ఆ క్లిప్సింగ్స్‌... ఈ వ్యాసం రెండో భాగం జూలై సంచికలో.. 
                                                      






Thursday, 28 May 2015

ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు

అవసరమైనది దొరకనప్పుడు అదే మనకు ప్రియం అవుతుందిఇజ్రాయెల్‌కు లేనిది నీరుఅదే అక్కడ అపురూపంఅపురూపమైన నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి చుక్కనీరు వృథా కాకుండా సమర్ధంగా వాడుకున్నారుజాతిగా తమకున్న అపార మేథోశక్తిని ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారువాటి సాయంతో ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారుఏదీ దొరకని చోట అన్నీ దొరికేలా చేసుకున్నారుఅన్నీ ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా నిలిచారునా ఇజ్రాయెల్‌ పర్యటనలో చూసిన అనుభవాలతో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు రాజకీయాలు మన రైతులకెంత శాపంగా పరిణమించాయో నాకు అర్ధమైందిఈ రెండు దేశాలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదేమిగతావన్నీ దీని తర్వాతే

భారత్ తో పోల్చితే  ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను