ఎటువంటి
విధానాలు అమలు చేస్తే రైతులు
స్థిరమైన ఆదాయం పొందుతారనే
విషయం పాలకులకు తెలియనిదేమీ
కాదు. ఇప్పడు
పంట నష్టపోతే వచ్చే ఏడాది
ఖరీఫ్ నాటికి కానీ పరిహారం
(అసలు
వస్తుందన్న గ్యారంటీ లేదు)
చేతికందటం లేదు.
మన రైతులు పంట చేలో
కలుపు మొక్కలు ఏరుతున్నారు
కానీ, ఈ
దేశ "రాజకీయాలకు
పట్టిన చీడల్ని"
వదిలించడంపై దృష్టి
పెట్టి ఉంటే వారి పరిస్థితులు
ఈ పాటికి బాగుపడేవేమో..!
ఏమంటారు?
పంటల బీమా పథకం లోని
లొసుగుల్ని విశ్లేషిస్తూ
నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ
ఈనాడు ప్రచురించింది.
మీ కోసం ఆ క్లిప్పింగ్....
Wednesday, 22 July 2015
Wednesday, 1 July 2015
Monday, 29 June 2015
బలిపీఠంపై రైతులు
వ్యవస్థాగతంగా
వేళ్లూనుకుపోయిన సమస్యల్ని
పరిష్కరించకపోవడంతో వ్యవసాయం
ఒక దండుగ మారి వ్యాపకంగా
మారింది.
వరుస నష్టాలు
వస్తున్నా ఒకసారి కాకపోతే
మరోసారి ఒడ్డునపడతామన్న
గుడ్డినమ్మకంతో సేద్యం
కొనసాగిస్తున్న వారు కొందరైతే.,
కొండల్లా పెరిగిన
అప్పులు తీర్చే మార్గం లేక
ప్రభుత్వాల తోడ్పాటు లేక
మరికొందరు రైతులు బలవన్మరణాలకు
పాల్పడుతున్నారు.
దేశంలో రైతుల
ఆత్మహత్యలకు కారణాలు,
పరిష్కారాలపై నేను
రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు
ప్రచురించింది.
ఆ వ్యాసాన్ని మీ
కోసం ఇక్కడ అప్‌లోడ్
చేస్తున్నాను.
Tuesday, 2 June 2015
Thursday, 28 May 2015
ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు
అవసరమైనది
దొరకనప్పుడు అదే మనకు ప్రియం
అవుతుంది. ఇజ్రాయెల్‌కు
లేనిది నీరు. అదే అక్కడ అపురూపం. అపురూపమైన
నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి
చుక్కనీరు వృథా కాకుండా
సమర్ధంగా వాడుకున్నారు. జాతిగా
తమకున్న అపార మేథోశక్తిని
ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా
సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఆవిష్కరించారు. వాటి
సాయంతో ఊహకందని ఫలితాలను
రాబట్టుకున్నారు. ఏదీ
దొరకని చోట అన్నీ దొరికేలా
చేసుకున్నారు. అన్నీ
ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా
నిలిచారు. నా
ఇజ్రాయెల్ పర్యటనలో చూసిన
అనుభవాలతో రెండు దేశాల మధ్య
ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు
రాజకీయాలు మన రైతులకెంత శాపంగా
పరిణమించాయో నాకు అర్ధమైంది. ఈ
రెండు దేశాలకూ ఉన్న ప్రధాన
వ్యత్యాసం ఇదే. మిగతావన్నీ
దీని తర్వాతే.
భారత్
తో పోల్చితే ఇజ్రాయెల్
వ్యవసాయంలో ఉన్నదీ మనకు
లేనిదీ.,
రెండు
దేశాల మధ్య ఉన్న సారూప్యాలు,
వ్యావసాయకంగా
ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన
వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది.
మీ
కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Wednesday, 13 May 2015
ఇజ్రాయెల్ వ్యవసాయంపై కొన్ని కథనాలు
ఇజ్రాయెల్
పర్యటన సందర్భంగా నేను ఏకకాలంలో అటు ఈనాడుకు ఇటు ఈటీవీకి పనిచేయాల్సి
వచ్చింది. చూసిన ఒక అంశంపై ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవడం అదే సమయంలో వారు
వివరిస్తున్న సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బందులు ఎదురైనా., అవన్నీ
తెలుసుకోవాలనే నా ఆసక్తి ముందు తేలిపోయాయి. ఈ పర్యటన సందర్బంగా ఈనాడుకు
నేను రాసిన కథనాల క్లిప్పింగ్స్‌ను ఇక్కడ ఇస్తున్నాను. మరికొన్ని కథనాలు
రాస్తున్నాను. మునుముందు వాటినీ ముఖపుస్తక మిత్రులకు అందిస్తాను. ఈటీవీలో
4వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇజ్రాయెల్ వ్యవసాయంపై ఇదీసంగతిలో ఒక అరగంట
ప్రత్యేక కార్యక్రమంతో పాటు మరికొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఇందుకు
సహకరించిన ఈనాడు, ఈటీవీ సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని,
కథనాలను చూసి ప్రశంసించిన మా గౌరవ ఛైర్మన్ రామోజీరావుకు వేనవేల కృతజ్ఞతలు.


Wednesday, 6 May 2015
సహచరుల ఆత్మీయత మరువలేను
ఇజ్రాయెల్ నుంచి రాగానే నా సహచర బృందం నాకో తీపి జ్ఞాపకాన్ని అందించింది.
పాత్రికేయంలో మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆశీర్వదించింది. ఒక బాస్‌గా కాకుండా
వారి బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తున్న ఒక శ్రేయోభిలాషిగా వారు నన్ను
చూస్తున్న తీరు నాకు సంతోషానిచ్చింది. నా బృందంలోని ప్రతి ఒక్కరికీ
పేరుపేరునా వందనాలు. మిత్రులారా మీ ఆత్మీయతను మరువలేను. మీ పట్ల నా
బాధ్యతలను ఏ నాడూ మరచిపోను. అందరికీ ధన్యవాదాలు.
Subscribe to:
Posts (Atom)




















