సదుపాయాలు కల్పించకుండా చిన్న రైతులు సేద్యంలో లాభాపడలేక
పోతున్నారంటూ కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది కేంద్ర
ప్రభుత్వం. రైతుకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఎలాంటి
అవకాశాలు కల్పించకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యవసాయ ఒప్పందాలను
కుదుర్చుకుంటోంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని స్వాగతించాలా వద్దా అనే
సంగతిని పక్కన పెడితే రైతుకు రక్షణ కల్పించే ఆంశాలను ఈ ఒప్పందాల్లో ఎందుకు
పొందు పరచలేదన్నదే ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ వ్యవసాయ విధానంలో రైతు
ప్రయోజనాలను విస్మరించిన ఆంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు "ఈనాడు"
ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Saturday, 11 May 2013
Thursday, 25 April 2013
చైతన్యం రావాల్సింది సర్కారులో....!
ప్రభుత్వం మీ కోసం లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేసింది., ఈసారి పనిముట్లకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, ఎరువులు కొరత లేకుండా చూస్తాం., విత్తనాలకు కొరత రానీయకుండా చూస్తాం....... రైతు చైతన్య యాత్రల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పెంచుతున్న అవగాహన ఇది. వాస్తవానికి రైతులకు అవగాహన పెంచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న సేధ్యరంగాన్ని గట్టెక్కించాలంటే రైతులకు మార్కెట్ తెలివిడిని పెంచే చర్యలు చేపట్టాలి. ఈ ఏడాది ఏయే పంటలకు గిరాకీ ఉంది.? ఏయే పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చెయాలి...? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఏ సమయంలో పంటను మార్కెట్ కు తీసుకువెళితే రైతుకు మంచి ధర వస్తుంది ...? ఒకవేళ ధర లేకపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది... ? మంచి ధరలు ఎలానూ ఇవ్వలేని ప్రభుత్వం చైతన్య యాత్రల్లో రైతుకు నేర్పాల్సినవి ఇవే...! ఇవన్నీ వదిలిపెట్టి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని యాత్రల పేరిట ఈ జాతరకు ఖర్చు చేస్తుండటం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Thursday, 18 April 2013
శ్రీరాముడే నిజమైన స్ఫూర్తి ప్రదాత
ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు సదా పూజ్యనీయుడు. అత్యున్నత వ్యక్తిత్వంలోని స్పూర్తిమత్వాన్ని మనం రాముడులోనే చూస్తాం. ధర్మవర్తనుడుగా నిలవటమే కాకుండా విశిష్ట లక్షణాలతో సకల సద్గుణాల కలబోసిన వ్యక్తి కనుకే రాముడు జగదబిరాముడు అయ్యాడు. ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజనానికి మార్గదర్శకుడుగా నిలిచాడు. అటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవడమే మానవాళికి నిజమైన వికాసం. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Thursday, 11 April 2013
శ్రీ విజయ ఉగాది శుభాకాంక్షలు
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకునే పండుగే యుగాది ఉగాది. తొలి సంవత్సరాదిగా తెలుగు ప్రజలు వ్యవహరించే ఈ పండుగ రోజు ఉదయాన్నే పూజ చేసి షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడిని సేవించడం మన సంప్రదాయం. వసంత నవరాత్రులు ఆరంభమయ్యే ఈ శుభదినం నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సకల జనావళికి శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Wednesday, 27 March 2013
స్థాయీ సంఘాలపై చిత్తశుద్ధి ముఖ్యం!
స్థాయీసంఘాల ఏర్పాటుతో బడ్జెట్లో పారదర్సకత, జవాబుదారీతనం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బడ్జెట్ పద్దులు 40 ఉండగా, వాటిలో కీలకమైన 37 శాఖలను 12 స్థాయీ సంఘాల పరిధిలోకి తెఛారు. ఒక్కో సంఘంలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. సభ్యులతో పాటు నిపుణులు, మేధావుల విశ్లేషణలతో స్థాయీ సంఘాల నివేదికలు ఉన్తాయి. ఇంటువంటి సంఘాల ద్వారా ప్రతి సభ్యునికి విధి నిర్వహణపరమైన సంతృప్తి లభిస్తుంది.
అంకెల గారడీగా ఉండే బడ్జెట్లో లోతైన విశ్లేషణ చేయడానికి స్థాయీ సంఘాలు ఉపయోగపడతాయి. అయితే స్తాయీసంఘాలు సమర్ధంగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు చేకూరతాయి. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. శాసనసభకు సమర్పించే నివేదికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన ఏమీ లెదు. అయితే, ఆ వంకతో తానూ పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వీటి వల్ల ఫలితం గుండుసున్నా!
Thursday, 7 March 2013
మహిళా నీకు వందనం
దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే రోజే .... అంతర్జాతీయ మహిళా దినోత్సవం. విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం... ఒకటేమిటి అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ఒకింత ఎక్కువగానూ నిలిచి గెలుస్తున్నారు మహిళలు. ఆయా రంగాల్లో కష్టాలను ఎదుర్కొంటూనే విజయ బావుటా ఎగుర వేస్తున్నారు. మహిళలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా వారిపై వివక్ష, దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని డిల్లీలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘ్హాతుకమ్... దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై కొత్త భయాలను అనుమానాలను రెకెత్తించిన్ది. అసలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని రంగాల్లో నేలకొన్నప్పుడే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమవుతుంది. ఇది అత్యంత త్వరితంగానే సాకారం కావాలని కోరుకుంటూ యావత్ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Thursday, 28 February 2013
నిరాశ పరచిన చిదంబరం
భారీ అంకెల తిరగమోతగానే యూపీఏ-2 చివరి సంపూర్ణ బడ్జెట్ ను చిదంబరం మహా ఘనంగానే వండి వార్చారు. పన్నుల సంస్కరణల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ను ప్రకటించిన చిదంబరం .. జన సామాన్యం పై వడ్డన భారం పొంచే ఉందని పరోక్షంగా చెప్పారు. గత ఏడాది ఏడాది కంటే 22 శాతం పెంచి వ్యవసాయరంగానికి 27 వేల 49 కోట్లు కేటాయించారు. అలానే ఏడు లక్షల కోట్ల రైతు రుణాల లక్ష్యంలో మంజూరయ్యేది ఎంతన్నదే అసలు ప్రశ్న! రైతుల భధ్రతకు భరోసా ఇవ్వకుండా ఆహార భధ్రత కు సైతం పెద్దగా కేటాయింపులు లేకుండా చిదంబరం బడ్జెట్ చాలా చప్పగా ఉంది. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే ..... అటు ఎన్నికల ఊసులు ఎక్కువగా లేకుండా ఇటు సంక్షేమం ఆశలు వెల్లివిరియకుండా ఎవరినీ పెద్దగా సంతృప్తి పరచకుండానే సాగిన బడ్జెట్ ఇది.
Subscribe to:
Posts (Atom)







