Pages

Wednesday, 27 March 2013

స్థాయీ సంఘాలపై చిత్తశుద్ధి ముఖ్యం!

                                                         
                           
స్థాయీసంఘాల ఏర్పాటుతో బడ్జెట్లో పారదర్సకత, జవాబుదారీతనం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బడ్జెట్ పద్దులు 40 ఉండగా, వాటిలో కీలకమైన 37 శాఖలను 12 స్థాయీ సంఘాల పరిధిలోకి తెఛారు. ఒక్కో సంఘంలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. సభ్యులతో పాటు నిపుణులు, మేధావుల విశ్లేషణలతో స్థాయీ సంఘాల నివేదికలు ఉన్తాయి. ఇంటువంటి సంఘాల ద్వారా ప్రతి సభ్యునికి విధి నిర్వహణపరమైన సంతృప్తి లభిస్తుంది.
అంకెల గారడీగా ఉండే బడ్జెట్లో లోతైన విశ్లేషణ చేయడానికి స్థాయీ సంఘాలు ఉపయోగపడతాయి. అయితే స్తాయీసంఘాలు సమర్ధంగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు చేకూరతాయి. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. శాసనసభకు సమర్పించే నివేదికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన ఏమీ లెదు. అయితే, ఆ వంకతో తానూ పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వీటి వల్ల ఫలితం గుండుసున్నా!

No comments: