Tuesday, 1 March 2016
Thursday, 31 December 2015
కర్షకరత్న పురస్కారం
మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం
అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం
9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి
సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Tuesday, 10 November 2015
Thursday, 22 October 2015
Monday, 14 September 2015
ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు
తెలుగు రాష్ట్రాల్లో
వర్షాలు జోరుగా పడుతున్నాయి.
వేసిన పంటలకు ఈ వర్షాలు
జీవం పోస్తాయి.
కానీ ఇప్పటికే ఖరీఫ్
సీజన్ కళ తప్పింది.
పంటల సాగు రెండు రాష్ట్రాల్లో
మూడువంతులే సాధ్యపడింది.
సీజన్ గతి తప్పినా వరి
వేయాలనేదే చాలా మంది ఆలోచన.
నిజానికి ఇప్పుడు వరి
వేస్తే దిగుబడులపై ప్రభావం
చూపడం ఖాయం.
స్థానిక పరిస్థితుల కారణంగా
వరికి బదులు ముందస్తు రబీకి
ఆరుతడి పంటలను ఎంచుకోవాలని
సూచిస్తున్న నా వ్యాసాన్ని
ఈరోజు ఈనాడు ప్రచురించింది.
నోట్:
ప్రచురించిన
వ్యాసంలోని పట్టికను లక్షల
ఎకరాలకు బదులు హెక్టార్లుగా
భావించగలరు
Sunday, 30 August 2015
పేదింట్లో ఉడకని పప్పులు!
కిలో
కందిపప్పు రూ.150.,
కిలో మినపగుండ్లు
రూ.140.,సామాన్యుడికి
పోషకాహారాన్ని అందించే
పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ
అదుపూ లేకుండా పెరిగిపోతోంటే
ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో
ఉందనేది ఏలినవారి మాట.
దేశంలో పప్పుధాన్యాల
ఉత్పత్తి, సరఫరా,
పంపిణీ,
ధరల మధ్య సమన్వయం
సాధించడంలో కేంద్ర ప్రభుత్వం
విఫలమవుతోంది. ఏళ్లు
గడుస్తున్నా దిగుమతులతో
చేతిచమురు వదిలించుకుంటోందే
తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న
మెట్ట రైతులకు చేయూతను అందించడం
లేదని విశ్లేషించిన నా
వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది. మీ
కోసం ఇక్కడ అప్ లోడ్
చేస్తున్నాను.
Wednesday, 22 July 2015
విపత్తుల నుంచి రైతుకు రక్షణేదీ?
ఎటువంటి
విధానాలు అమలు చేస్తే రైతులు
స్థిరమైన ఆదాయం పొందుతారనే
విషయం పాలకులకు తెలియనిదేమీ
కాదు. ఇప్పడు
పంట నష్టపోతే వచ్చే ఏడాది
ఖరీఫ్ నాటికి కానీ పరిహారం
(అసలు
వస్తుందన్న గ్యారంటీ లేదు)
చేతికందటం లేదు.
మన రైతులు పంట చేలో
కలుపు మొక్కలు ఏరుతున్నారు
కానీ, ఈ
దేశ "రాజకీయాలకు
పట్టిన చీడల్ని"
వదిలించడంపై దృష్టి
పెట్టి ఉంటే వారి పరిస్థితులు
ఈ పాటికి బాగుపడేవేమో..!
ఏమంటారు?
పంటల బీమా పథకం లోని
లొసుగుల్ని విశ్లేషిస్తూ
నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ
ఈనాడు ప్రచురించింది.
మీ కోసం ఆ క్లిప్పింగ్....
Subscribe to:
Posts (Atom)






