మిడతల దండు ఉత్తర భారత రాష్ట్రాలను కమ్మేస్తున్న తరుణంలో దేశం అప్రమత్తం అయింది. తెలుగు రాష్ట్రాలకు ముప్పు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో అవి సంసిద్ధంగా ఉండటం అవసరం. ప్రపంచ ఆహార భద్రతను ప్రభావితం చేసే ఈ దండుపై ముప్పేట దాడికి కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Sunday, 31 May 2020
Saturday, 16 May 2020
Monday, 4 May 2020
నేలకు సుస్తీ చేస్తే..!
మనకు ఒంట్లో నలతగా ఉంటే వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకుంటామో., నేల విషయంలోనూ అంతే చేయాలి. నేల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించి పోషక లోపాలు ఉంటే వాటిని సవరించుకుంటూ భూసారాన్ని పరిరక్షించుకోవాలి. భూసార పరీక్షల ప్రకారం పంటలను ఎంపిక చేసుకుని నేలకు ఏమివ్వాలో అది అందించగలిగితే మంచి దిగుబడులు సాధ్యపడతాయి. అలానే పెట్టుబడి ఖర్చులు తగ్గి భూభౌతిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ అంశంపై నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మే సంచిక ప్రచురించింది.
Sunday, 3 May 2020
Saturday, 2 May 2020
రోగనిరోధకశక్తినిచ్చే నిమ్మజాతి పండ్ల సాగు
మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే కరోనా సహా ఎలాంటి వైరస్ లు త్వరితంగా మనల్ని ఆశించే అవకాశం లేదన్నది వైద్యుల మాట. ఈ కారణంగానే గత నెల రోజులుగా రోగనిరోధకశక్తినిచ్చే నిమ్మజాతి పండ్ల వినియోగం అమాంతం పెరిగింది. దురదృష్టం ఏమంటే వాటిని పండించిన రైతులకు మాత్రం ధరలు గిట్టుబాటు కావడం లేదు. వీటి సాగును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)