Pages

Monday, 28 January 2019

సేద్యంలో డిజిటల్ పరిజ్ఞానం

మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు, ఎండీ కిరణ్ గార్లతో  ఇక్రిశాట్ డిజిటల్  శాస్త్రవేత్తల బృందం సమావేశం. ఈటీవీ భారత్ ద్వారా వ్యవసాయానికి డిజిటల్ పరిజ్ఞానాన్ని జోడించి రైతులకు   సేవలందించే దిశగా చేస్తున్న ప్రయత్నామిది.


Monday, 14 January 2019

రైతుల పండుగ

రైతుల పండుగ  సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలను, సౌభాగ్యాలను పంచాలని  మనసారా కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.

Sunday, 13 January 2019

భోగభాగ్యాలు

భోగి మంటలు మీ జీవితంలో అశాంతిని దగ్ధం చేసి, భోగ భాగ్యాలతో వెలుగులు నింపాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు. మీ అమిర్నేని హరికృష్ణ

Saturday, 12 January 2019

రైతుకు నిజమైన పండుగ ఎప్పుడు?

గ్రామాల్లోని రైతుల వాస్తవిక పరిస్థితులకు ఈనాడు లో ఈ రోజు ప్రచురితమైన నా వ్యాసం నిలువుటద్దం.

Friday, 11 January 2019

అన్నదాత మాసపత్రికకు శ్రీవెంకయ్యనాయుడు గారి ప్రశంసలు

నిలువెత్తు తెలుగు సంతకం, స్ఫూర్తిప్రదాత, భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఈ రోజు ఉదయం వారింట్లో కలుసుకున్నాం. అన్నదాత స్వర్ణోత్సవ సంచికను వారికి అందించేందుకు వెళ్లిన సందర్భంలో తీసుకున్న జ్ఞాపకాలివి. దేశంలో మరెవ్వరూ చేయనంతగా రైతుల కోసం రామోజీరావుగారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను చాలా ఓపికగా మొత్తం చూసి వ్యవసాయం అనుబంధ రంగాలలో అన్ని ప్రధాన అంశాలను కలబోసి తీసుకువచ్చిన గొప్ప ప్రయత్నంగా కితాబిచ్చారు. ఇటీవల అన్నదాత మేగజైన్‌లో వచ్చిన మార్పులను ప్రస్తావించి ఎంతో చక్కగా వస్తున్నదని ప్రశంసించటం సంతోషం కలిగించింది.
                                                                           





Friday, 4 January 2019

రైతు శ్రేయం ధ్యేయంగా...

జనవరి నెల స్వర్ణోత్సవ అన్నదాత మాసపత్రిక సంపాదకీయం..

Thursday, 3 January 2019

అన్నదాత కు స్వర్ణోత్సవం

తెలుగు రైతుల మానస పుత్రిక ' అన్నదాత ' మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు. స్వర్ణోత్సవ సంచికను నా సంపాదకత్వంలో తీసుకువచ్చే  అవకాశాన్ని నాకు దక్కించిన  రామోజీరావు గారు, ఎం. డీ కిరణ్ గార్లకు   నా ధన్యవాదాలు.