Pages

Saturday, 15 July 2023

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన

ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసo  ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.



Wednesday, 7 June 2023

చెవిలో పుష్పాలు


సాగు వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ఇస్తామంటే కనీసం ఇవ్వడానికి ప్రయత్నిస్తారేమో అనుకున్నా.  ఇలా సాగు వ్యయాన్ని తగ్గించి చూపి చెవిలో పుష్పాలు పెడతారనుకోలేదు. కేంద్రం చూపుతున్న సాధారణ రకం వరి సాగు వ్యయం క్వింటాకు రూ. 1455.  వాస్తవ సాగు వ్యయం రూ.3300.  యాభై శాతం అదనంగా ఇవ్వడం కాదు రైతుకు సగం కూడా మద్ధతు ధర దక్కడం లేదు.

Friday, 28 April 2023

ఆహారశుద్ధితోనే ఆదాయ స్థిరత్వం

 

ఉత్పత్తిని అదే రూపంలో విక్రయించుకునే కంటే విలువ జోడించడం ద్వారా రెట్టింపు ధరను పొందే అవకాశముంది. భారత్‌లో ఆహారశుద్ధి రంగం విస్తరిస్తున్నప్పటికీ రైతులకు ధరల విషయంలో మాత్రం దగా తప్పడం లేదు. ఓ వైపు విలువ జోడింపు ఉత్పత్తులు సూపర్‌ మార్కెట్లను ముంచెత్తుతుంటే మరోవైపు ఆహారశుద్ధి రంగంలో దేశీయ తయారీ పరిశ్రమ ఇంకా వేగాన్ని అందుకోలేకపోతోంది. ఆహారశుద్ధి పరిశ్రమలను ఎక్కడికక్కడ విస్తరించి వాటిని రైతులతో అనుసంధానిస్తేనే సాగుదార్లకు మేలు జరుగుతుంది. వారికి స్థిరమైన ఆదాయాలు అందుతాయంటున్న నా వ్యాసం ఈ రోజు ఈనాడులో ప్రచురితమైంది.



Wednesday, 15 March 2023

పోషకాహార భద్రత కావాలిప్పుడు



 దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.


Sunday, 1 January 2023

సిరిధాన్యాలతోనే ఆహారభద్రత

ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వాడకం పెరిగితేనే ఆహార భద్రత సాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.



Thursday, 1 December 2022

ఎగుమతి నైపుణ్యాలతోనే ఆదాయవృద్ధి

వ్యవసాయాన్ని వాణిజ్యంగా గుర్తించడంలో  తొలినాళ్ల విఫలమయ్యాం.  పురోగతి  ఉన్నప్పటికీ  ఆహారశుద్ధి రంగం విస్తరణ ఆశించినంత పెరగడం లేదు. విలువ జోడింపు అవకాశాలు పట్టణాల స్థాయికి విస్తరించాలి. రైతులకు ఆహార ప్రమాణాలు, ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత చివరి సంచిక డిసెంబరు 2022లో ప్రచురితమైంది.