దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.
Wednesday, 15 March 2023
పోషకాహార భద్రత కావాలిప్పుడు
దేశ జనాభాలో15 శాతం పోషకాహార లోప బాధితులు. నిత్యం 3 వేల నవజాత శిశు మరణాలు. దేశానికిప్పుడు కావాలసింది పోషకాహార భద్రత. ఇందుకు ప్రజాపంపిణీలో చిరుధాన్యాల పంపిణీతో పాటు అన్ని తృణధాన్య పంటలకు మద్దతు ధరలిచ్చి కొనుగోళ్లకు గ్యారంటీలు కల్పించడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసం ఈనాడులో ప్రచురితమైంది.
Friday, 13 January 2023
Sunday, 1 January 2023
సిరిధాన్యాలతోనే ఆహారభద్రత
ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వాడకం పెరిగితేనే ఆహార భద్రత సాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.
Thursday, 1 December 2022
ఎగుమతి నైపుణ్యాలతోనే ఆదాయవృద్ధి
వ్యవసాయాన్ని వాణిజ్యంగా గుర్తించడంలో తొలినాళ్ల విఫలమయ్యాం. పురోగతి ఉన్నప్పటికీ ఆహారశుద్ధి రంగం విస్తరణ ఆశించినంత పెరగడం లేదు. విలువ జోడింపు అవకాశాలు పట్టణాల స్థాయికి విస్తరించాలి. రైతులకు ఆహార ప్రమాణాలు, ఎగుమతి నైపుణ్యాల పట్ల అవగాహన పెంచితే ఆదాయవృద్ధి జరిగే అవకాశాలు పుష్కలమంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత చివరి సంచిక డిసెంబరు 2022లో ప్రచురితమైంది.
Sunday, 13 November 2022
మార్కెట్ వ్యూహాలతో లాభసాటి సేద్యం
విదేశీ మార్కెట్లకు ఎప్పుడు ఏ సమయంలో ఉత్పత్తిని పంపితే లాభసాటి ధరలు అందుతాయనే మార్కెట్ నైపుణ్యాల గురించి మన రైతులకు అవగాహన కల్పించాలి. అంతకుమించి ఎగుమతి ఆధార వ్యవసాయం కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఎంతో అవసరం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Tuesday, 1 November 2022
సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు
సేద్యంలో లక్షలు సంపాదించడం కంటే ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడమే ధ్యేయంగా ప్రకృతితో కలిసి నడిచే సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు సేంద్రియ వ్యవసాయ రుషి కండ్లగుంట శ్రీనివాసరావు. పర్యావరణాన్ని కాపాడుకునే సాగు విధానాలను ఆచరిస్తూ ప్రకృతితో పాటు రైతులూ బాగుండాలనే లక్ష్యంతో అక్షయ కమ్యూనిటీ వ్యవసాయాన్ని నడిపిస్తున్న తీరుపై నేను రాసిన వ్యాసం అన్నదాత నవంబరు సంచికలో ప్రచురితమైంది.












