Pages

Friday, 29 March 2019

సారాన్ని బట్టి పంట

దేశవ్యాప్తంగా భూసారం క్షీణిస్తోంది. విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లేస్తున్న కారణంగా నేలల జీవం కోల్పోతున్నాయి. పంట మార్పిడి పాటించకపోవడం, భూతాపం తదితర కారణాలతో నేలలు ఇప్పటికే నిస్సారమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో భాస్వరం, జింక్‌, బోరాన్‌, మాంగనీస్‌, ఇనుము లోపాలు తీవ్రంగా ఉన్నాయి. వీటిని సరిచేసే చర్యలు చేపట్టకుండా ఇలానే సేద్యం సాగిస్తూ పోతే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత దారుణంగా పడిపోతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
                                                                   

Monday, 25 March 2019

తాయిలాలే గెలుపు మంత్రాలా..?

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎన్నికల్లో రైతుమంత్రం జపించాల్సిందే. రుణమాఫీలని ఒకరు, పెట్టుబడి సాయాలంటూ మరొకరు, సంక్షేమ పధకాలంటూ ఇంకొకరు. ఎన్నికలప్పుడే వీరికి రైతులు గుర్తుకొస్తారు తప్ప సాగుదార్ల వాస్తవ కష్టాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                

Friday, 8 March 2019

పండ్ల రసాల తయారీ యూనిట్ పెడతారా..!

రైతులు ఉత్పత్తి దారుల సంఘాలుగా ఏర్పడి  పండ్ల రసాలు తయారీతో ఆదాయం పొందే విధానం గురించి నేను రాసిన వ్యాసం మార్చి నెల అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది.


అన్నదాత మార్చి నెల సంపాదకీయం

అన్నదాత మాసపత్రిక మార్చి 2019 సంచిక కవర్ పేజీ, సంపాదకీయం.

ఫసల్ బీమా... ఏదీ ధీమా?

స్వాతంత్ర్యానంతరం దేశాన్ని పాలించిన పార్టీలన్నీ రైతుల్ని నట్టేట ముంచాయి. పంటల బీమాను సక్రమంగా అమలు చేయడంలో అన్ని పార్టీలదీ వైఫల్యమే. మోదీ అధికారం చేపట్టాక తెచ్చి ఎంతో విభిన్నమైనదని ప్రకటించిన ఫసల్ బీమా డొల్లతనం ఆచరణలో నిరూపితమైంది.  ఈ పథకం లోటుపాట్లపై నేను రాసిన వ్యాసాన్ని శుక్రవారం ఈనాడు దినపత్రిక ప్రచురించింది.



Saturday, 9 February 2019

పొలాలకు చేరని పరిశోధనలు

వ్యవసాయ పరిశోధనలు మందగించడం, విస్తరణ సేవలు రైతులకు అందకపోవడంతో పంటల సాగులో రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.

Thursday, 7 February 2019

రైతుసంఘాల స్థాయిలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు

ఏటా సీజన్ కు ముందు నకిలీ, నాసిరకం విత్తనాలతో ఎందరో రైతులు పెట్టుబడులతో పాటు ఒక్కోసారి సర్వస్వం కోల్పోవాల్సి వస్తోంది. రైతు సంఘాల స్థాయిలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలిగితే విత్తన సమస్యను చాలా వరకు నివారించవచ్చు. వీటి ఏర్పాటుకున్న అవకాశాల గురించి నేను రాసిన వ్యాసం ఫిబ్రవరి "అన్నదాత" మాసపత్రికలో ప్రచురితమైంది.