సేద్యానికి
అనువుగా లేని ప్రాంతాలలో
గొర్రెల పెంపకాన్ని వాణిజ్య
సరళిలో చేపట్టడం లాభసాటి.
పంటల సాగుకు అనుబంధంగా
చేపట్టే ఇలాంటి వ్యాపకాల
వల్ల రైతులు స్థిరమైన ఆదాయాలను
అందుకోగలుగుతారు. ఒక
వంద గొర్రెలతో పెంపకం చేపడితే
వచ్చే ఆదాయ వ్యయాల ప్రాజెక్టు
రిపోర్టుతో పాటు ఇతర వివరాలతో
కూడిన వ్యాసాన్ని ఆగస్టు నెల
"అన్నదాత"
మాసపత్రిక ప్రచురించింది.
Saturday, 18 August 2018
Monday, 13 August 2018
నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి
నేలల్లో రకాలున్నా అందరూ పండించేది అదే నేలపై. కొందరు రైతులు తెలివిగా సేద్యంలో లాభాలు రాబట్టుకుంటుంటే., అధిక శాతం మంది కడగండ్లను ఎదుర్కొంటున్నారు. సేద్యంలో నైపుణ్యాలను పెంచుకుంటూ సేద్యాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంలా చేయగలుగుతున్న వాళ్లను విజయాలు వరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల చేయూత లోపం, మార్కెట్ శక్తుల ప్రాబల్యం ఇవన్నీ రైతుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి సాధ్యపడుతుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా చేపట్టి నైపుణ్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుతాయంటున్న నా వ్యాపాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Tuesday, 10 July 2018
అరటి ఆసాంతం ఉపయోగమే..!
గతంలో అరటి చెట్టును గెలలు కోశాక బోదెల్ని పారవేసేవారు. అవన్నీ వ్యర్ధాలుగా
మిగిలిపోయేవి. ఒక దశాబ్ద కాలంగా అరటి బోదెల్ని ఉపయోగించి ఎన్నో రకాల
ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలవచర్ల కృషి
విజ్ఞాన కేంద్రం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసే వారికి సాంకేతికంగా ఎంతో
సహాయం అందిస్తోంది. యువతరంతో పాటు స్వయం సహాయక బృందాల మహిళలు, రైతులు అదనపు
అదాయం కోసం వీటిని ఏర్పాటు చేసుకుని లాభపడ వచ్చనే సమాచారంతో ఈ నెల
అన్నదాతలో ఒక వ్యాసం రాశాను.
Friday, 22 June 2018
పుట్లు పండించే విత్తులేవీ?
ఎన్నో పంటల్లో మనం అధికోత్పత్తులు సాధిస్తున్నాం. కానీ పంటల సగటు ఉత్పాదకత పెరగడం లేదు. ఫలితంగా రైతుకు స్ధిరమైన నికరాదాయం దక్కడం లేదు. ఉత్పత్తితోపాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచే దిశగా మరింత పరిశోధనలు జరగాలి. అధికోత్పత్తులను అందించే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన తరుణంలో అధిక దిగుబడులు అందించే విత్తనాల అందుబాటు, విత్తన చట్టాలు పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Thursday, 7 June 2018
సాగు సాంకేతికతకు ఇజ్రాయెల్ నగిషీలు
ప్రపంచ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనల వల్ల అత్యాధునిక విషయాలు
తెలుస్తుంటాయి. సరికొత్త పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, సరికొత్త
యంత్రాలు... ఇలా ఆధునిక సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది గత
నెలలో ఇజ్రాయెల్‌లో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సు, ప్రదర్శన. దీనిపై నేను
రాసిన వ్యాసాన్ని జూలై నెల అన్నదాత మాసపత్రిక ప్రచురించింది.
Thursday, 3 May 2018
"చింత"కు విలువ జోడిస్తే.. నిశ్చింతే!
ఒక పంట బాగా పండే ప్రాంతాలలో వాటిని ప్రాసెస్ చేసే పరిశ్రమలను ప్రభుత్వాలు
ప్రోత్సహిస్తే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి. గిరిజన రైతుల్ని వ్యాపారులు
చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు. గిరిజన సహకార సంస్ధ తోడ్పాటు ఉన్నా
ప్రభుత్వాలు చొరవ చూపి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చేయూతనిస్తే
చింతచెట్లు పెంచే వారికి ఇక నిశ్చింతే అన్న నా వ్యాసం ఈ నెల అన్నదాత
మాసపత్రికలో ప్రచురితమైంది. ఇలాంటి యూనిట్లు పెట్టే రైతు సంఘాలు, యువ
పారిశ్రామికవేత్తలకు ఇదెంతో ఉపయోగకరం.
Monday, 30 April 2018
గ్రామీణ కొర్పొరేట్‌గా రైతు ఎదగాలి!
సేద్యం గిట్టుబాటు కాని నేటి పరిస్థితుల్లో.., వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సేద్యంలో విప్లవాత్మక ఫలితాలను అందుకుంటున్న వారే స్ఫూర్తిగా చిన్న, సన్నకారు రైతులు నేడు వ్యవసాయాన్ని కొ్త్తపుంతలు తొక్కించాలి. సేద్యాన్ని ఒక పరిశ్రమగా, ప్రతి రైతూ గ్రామీణ కొర్పొరేట్‌గా అవతరించగలగటమే సాగుదార్ల సంక్షోభానికి తీరైన జవాబు. ఈ క్రమంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుల ఆగ్రహం దేశవ్యాప్తమై వారిని దహించివేయడం ఖాయం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)












