Pages

Tuesday, 10 July 2018

అరటి ఆసాంతం ఉపయోగమే..!

గతంలో అరటి చెట్టును గెలలు కోశాక బోదెల్ని పారవేసేవారు. అవన్నీ వ్యర్ధాలుగా మిగిలిపోయేవి. ఒక దశాబ్ద కాలంగా అరటి బోదెల్ని ఉపయోగించి ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసే వారికి సాంకేతికంగా ఎంతో సహాయం అందిస్తోంది. యువతరంతో పాటు స్వయం సహాయక బృందాల మహిళలు, రైతులు అదనపు అదాయం కోసం వీటిని ఏర్పాటు చేసుకుని లాభపడ వచ్చనే సమాచారంతో ఈ నెల అన్నదాతలో ఒక వ్యాసం రాశాను.
                                                                     


Friday, 22 June 2018

పుట్లు పండించే విత్తులేవీ?

ఎన్నో పంటల్లో మనం అధికోత్పత్తులు సాధిస్తున్నాం. కానీ పంటల సగటు ఉత్పాదకత పెరగడం లేదు. ఫలితంగా రైతుకు స్ధిరమైన నికరాదాయం దక్కడం లేదు.  ఉత్పత్తితోపాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచే  దిశగా మరింత పరిశోధనలు జరగాలి. అధికోత్పత్తులను అందించే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఖరీఫ్ సీజన్‌ ఆరంభమైన తరుణంలో అధిక దిగుబడులు అందించే విత్తనాల అందుబాటు, విత్తన చట్టాలు పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు   ఈనాడు ప్రచురించింది.
                                                                  

Thursday, 7 June 2018

సాగు సాంకేతికతకు ఇజ్రాయెల్‌ నగిషీలు

ప్రపంచ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనల వల్ల అత్యాధునిక విషయాలు తెలుస్తుంటాయి. సరికొత్త పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, సరికొత్త యంత్రాలు... ఇలా ఆధునిక సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది గత నెలలో ఇజ్రాయెల్‌లో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సు, ప్రదర్శన. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని జూలై నెల అన్నదాత మాసపత్రిక ప్రచురించింది.
                                                                       

Thursday, 3 May 2018

"చింత"కు విలువ జోడిస్తే.. నిశ్చింతే!

ఒక పంట బాగా పండే ప్రాంతాలలో వాటిని ప్రాసెస్‌ చేసే పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి. గిరిజన రైతుల్ని వ్యాపారులు చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు. గిరిజన సహకార సంస్ధ తోడ్పాటు ఉన్నా ప్రభుత్వాలు చొరవ చూపి ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చేయూతనిస్తే చింతచెట్లు పెంచే వారికి ఇక నిశ్చింతే అన్న నా వ్యాసం ఈ నెల అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది. ఇలాంటి యూనిట్లు పెట్టే రైతు సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ఇదెంతో ఉపయోగకరం.
                                                                       


Monday, 30 April 2018

గ్రామీణ కొర్పొరేట్‌గా రైతు ఎదగాలి!

సేద్యం గిట్టుబాటు కాని నేటి పరిస్థితుల్లో.., వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సేద్యంలో విప్లవాత్మక ఫలితాలను అందుకుంటున్న వారే స్ఫూర్తిగా చిన్న, సన్నకారు రైతులు నేడు వ్యవసాయాన్ని కొ్త్తపుంతలు తొక్కించాలి. సేద్యాన్ని ఒక పరిశ్రమగా, ప్రతి రైతూ గ్రామీణ కొర్పొరేట్‌గా అవతరించగలగటమే సాగుదార్ల సంక్షోభానికి తీరైన జవాబు. ఈ క్రమంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుల ఆగ్రహం దేశవ్యాప్తమై వారిని దహించివేయడం ఖాయం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                            

Thursday, 5 April 2018

కరీంనగర్‌ డెయిరీ విజయబాట

కరీంనగర్‌ డెయిరీ విజయ ప్రస్థానంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో   నేను రూపొందించిన డాక్యుమెంటరీ. సేద్యం కలసిరాకపోయినా పశుపోషణ రైతుల్నిఆదుకుంటోంది అనడానికి ఇదొక నిదర్శనం. A Silent Revolution
                                                                                

Wednesday, 4 April 2018

పేద రైతుబిడ్డలకు ఉచిత వ్యవసాయశిక్షణ

పదో తరగతి వరకు చదివి పై చదువులకు వెళ్లే స్థోమత లేని పేద రైతు కుటుంబాలకు శుభవార్త. వ్యవసాయ రంగంలో ప్రాధమిక స్థాయిలో ఉద్యోగాలు పొందే (సమర్ధత ఉంటే పై స్థాయిలోనూ)లా ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసాయ కోర్సులను పూర్తి ఉచితంగా అందిస్తోంది నర్సాపూర్‌ (హైదరాబాద్‌కు 70 కి.మీటర్లు) కు సమీపంలోని "బేయర్‌-రామానాయుడు విజ్ఞానజ్యోతి విద్యాసంస్ధ". ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్‌ 2018 అన్నదాత మాసపత్రిక లో అందించాను. పేద రైతుబిడ్డలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.