ఒక పంట బాగా పండే ప్రాంతాలలో వాటిని ప్రాసెస్ చేసే పరిశ్రమలను ప్రభుత్వాలు
ప్రోత్సహిస్తే రైతులకు లాభసాటి ధరలు అందుతాయి. గిరిజన రైతుల్ని వ్యాపారులు
చేస్తున్న దోపిడీ అంతా ఇంతా కాదు. గిరిజన సహకార సంస్ధ తోడ్పాటు ఉన్నా
ప్రభుత్వాలు చొరవ చూపి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చేయూతనిస్తే
చింతచెట్లు పెంచే వారికి ఇక నిశ్చింతే అన్న నా వ్యాసం ఈ నెల అన్నదాత
మాసపత్రికలో ప్రచురితమైంది. ఇలాంటి యూనిట్లు పెట్టే రైతు సంఘాలు, యువ
పారిశ్రామికవేత్తలకు ఇదెంతో ఉపయోగకరం.
Thursday, 3 May 2018
Monday, 30 April 2018
గ్రామీణ కొర్పొరేట్‌గా రైతు ఎదగాలి!
సేద్యం గిట్టుబాటు కాని నేటి పరిస్థితుల్లో.., వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సేద్యంలో విప్లవాత్మక ఫలితాలను అందుకుంటున్న వారే స్ఫూర్తిగా చిన్న, సన్నకారు రైతులు నేడు వ్యవసాయాన్ని కొ్త్తపుంతలు తొక్కించాలి. సేద్యాన్ని ఒక పరిశ్రమగా, ప్రతి రైతూ గ్రామీణ కొర్పొరేట్‌గా అవతరించగలగటమే సాగుదార్ల సంక్షోభానికి తీరైన జవాబు. ఈ క్రమంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుల ఆగ్రహం దేశవ్యాప్తమై వారిని దహించివేయడం ఖాయం అంటున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Thursday, 5 April 2018
కరీంనగర్ డెయిరీ విజయబాట
కరీంనగర్ డెయిరీ విజయ ప్రస్థానంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను రూపొందించిన డాక్యుమెంటరీ.
సేద్యం కలసిరాకపోయినా పశుపోషణ రైతుల్నిఆదుకుంటోంది అనడానికి ఇదొక నిదర్శనం.
A Silent Revolution
Wednesday, 4 April 2018
పేద రైతుబిడ్డలకు ఉచిత వ్యవసాయశిక్షణ
పదో తరగతి వరకు చదివి పై చదువులకు వెళ్లే స్థోమత లేని పేద రైతు కుటుంబాలకు శుభవార్త. వ్యవసాయ రంగంలో ప్రాధమిక స్థాయిలో ఉద్యోగాలు పొందే (సమర్ధత ఉంటే పై స్థాయిలోనూ)లా ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యవసాయ కోర్సులను పూర్తి ఉచితంగా అందిస్తోంది నర్సాపూర్ (హైదరాబాద్‌కు 70 కి.మీటర్లు) కు సమీపంలోని "బేయర్-రామానాయుడు విజ్ఞానజ్యోతి విద్యాసంస్ధ". ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 2018 అన్నదాత మాసపత్రిక లో అందించాను. పేద రైతుబిడ్డలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Monday, 19 March 2018
లోపాలపుట్ట-పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ ముసాయిదా బిల్లు
పంటకు చీడపీడలు ఆశిస్తే ఏ మందును ఎంత మేరకు చల్లాలనేది 90 శాతం మంది రైతులకు తెలియదు. అది చెప్సాల్సిన విస్తరణ యంత్రాంగం ఉండదు. డీలర్లు ఏం ఇస్తే అది తెచ్చి చల్లుతున్నారు. వాళ్ల కమీషన్లు వాళ్లకు వస్తాయి. రైతు జేబులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా కేంద్రం రూపొందించిన "పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు-2017" ముసాయిదా సైతం లోపభూయిష్టంగా ఉంది. రెట్టింపు ఆదాయం రావాలంటే ముందు రైతులు ఖర్చులు తగ్గించుకోవాలి. రైతుల్ని ఉద్ధరిస్తామంటూ పాలకులు బడాయి ప్రకటనలు చేయడం తప్ప అన్నదాతకు మేలు చేసేలా చట్టాలకు పదును పెట్టకపోవడం వంటి చర్యలు వారి డొల్లతనాన్నిచెబుతున్నాయి. లోపాలపుట్టగా ఉన్న ఈ ముసాయిదా బిల్లు గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Saturday, 17 March 2018
Monday, 5 March 2018
రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే..!
కేంద్రప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తోంది. అందుకు ముందుగా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాల్సి ఉంది. ఈ దిశగా కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదు. రైతు ఆదాయాం రెట్టింపు కావాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)








