స్వాతంత్ర్యం
వచ్చాక నేటికి మన దేశం అన్ని
రంగాలలో ఎంతో పురోగమించిన
మాట వాస్తవం.
కొనుగోలు
శక్తి పరంగా పటిష్టమైన ఆర్ధిక
వ్యవస్ధ కలిగిన తొలి 5
దేశాల్లోనూ
మనం చోటు సాధించాం.
ఫోర్బ్స్
జాబితాలో చోటు సాధిస్తున్న
మన మిలియనీర్ల సంఖ్యా ఏటికేడూ
అధికమవుతోంది. వ్యవసాయరంగంలోనూ విప్లవాత్మక
మార్పులెన్నో చోటు చేసుకున్నాయి.
కానీ
ఒక్కటే ప్రశ్న.
రైతులెందుకు
దీనావస్ధలో ఉన్నారు..,
వారెందుకు
ఆత్మహత్యలకు పాల్పడాల్సి
వస్తోంది..?
మట్టినే
నమ్ముకున్నవారిని పట్టిపీడిస్తున్న
ఈ ప్రశ్నకు స్వాతంత్ర్యానంతరం
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలు తగిన జవాబు
చెప్పలేకపోవడాన్ని ఏమనాలి? రైతు దీనస్థితికి దారితీస్తున్న పరిస్థితుల్ని విశ్లేషించి వాటికి పలు పరిష్కారాలు సూచించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Tuesday, 9 May 2017
Saturday, 29 April 2017
జలరంగ మేధావి విద్యాసాగరరావు
నీటిపారుదల
రంగంలో ఎందరో ఇంజనీర్లు
పనిచేశారు., పదవీ
విరమణ చేశారు.
కొద్ది
మంది మాత్రం ఆ రంగంపై ఎనలేని
ముద్ర వేశారు.
ఇప్పటికే
నీటిపారుదలరంగ దిగ్గజం టి.
హనుమంతరావు
గారి మరణంతో కోలుకోలేని
స్థితిలో ఉన్న తెలుగు రాష్ట్రాలు
విద్యాసాగరరావు మరణంతో
శోకసంద్రంలో మునిగిపోయాయి.
సాగరన్న
మరణంతో తెలుగు రాష్ట్రాలే
కాదు యావత్ దేశం ఒక గొప్ప
ఇంజనీరింగ్ మేధావిని
కోల్పోయింది.
ఈనాడు
లో పనిచేస్తున్న కాలం నుంచి
నేటి నా ఈటీవీ ప్రస్థానం వరకు
ఈ మేధావులతో ఏర్పడ్డ పరిచయం
నాకు నీటిపారుదల రంగంపై ఎన్నో
విషయాలను తెలుసుకునేలా
చేసింది. ముఖ్యంగా
హనుమంతరావు,
విద్యాసాగరరావు,
చెరుకూరి
వీరయ్యలతో ఏర్పడిన అనుబంధం
ఆ రంగంపై నాకు ఎంతో పట్టు
వచ్చేలా చేసింది.
2009 ఎన్నికలప్పుడు
వైవెస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం
పేరుతో సాగిస్తున్న ధనయజ్ఞాన్ని
విద్యాసాగరరావు గారు నాకు
ఒక రెండు గంటల పాటు చెప్పుకుంటూ
పోయారు. అవన్నీ
వాయిస్ రికార్డు చేసి వాటిని
టైప్ చేస్తే అదొక పెద్ద
పుస్తకం అయింది.
ఇప్పటికీ
అది నా వద్ద భద్రంగా ఉంది.
ప్రతి
అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి
లోటుపాట్లను సరిచేయడం ద్వారా
నీటిపారుదల ప్రాజెక్టుల్లో
అవినీతి మలికిలేని వ్యవస్థ
కోసం ఆయన తపించిన తీరు నన్నెంతో
ఆకట్టుకుంది.
అప్పటి
నుంచి వారితో ఏర్పడ్డ సాన్నిహిత్యం
ప్రతిధ్వని చర్చలకు వారిని
ఆహ్వానిస్తూ ఇటీవలి వరకూ
కొనసాగింది.
సాగరన్నా
నువ్వు లేని తెలంగాణ చిన్నబోయింది.
తెలంగాణ
ఉద్యమానికి నువ్వు అందించిన
చేయూత ఈ జాతి ఎప్పటికీ మర్చిపోదు.
నీటిపారుదల
రంగానికి నువ్వందించిన సేవల్ని
తెలుగు జాతితో సహా ఈ దేశం
ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.భౌతికంగా
మమ్మల్ని వదిలి మీరు వెళ్లిపోయినా
మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో
ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.
మీ
ఆత్మకు శాంతి కలగాలని ఆ
భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తున్నాను.
Tuesday, 28 March 2017
Friday, 13 January 2017
Friday, 16 December 2016
Saturday, 29 October 2016
Subscribe to:
Posts (Atom)






