వ్యవస్థాగతంగా
వేళ్లూనుకుపోయిన సమస్యల్ని
పరిష్కరించకపోవడంతో వ్యవసాయం
ఒక దండుగ మారి వ్యాపకంగా
మారింది.
వరుస నష్టాలు
వస్తున్నా ఒకసారి కాకపోతే
మరోసారి ఒడ్డునపడతామన్న
గుడ్డినమ్మకంతో సేద్యం
కొనసాగిస్తున్న వారు కొందరైతే.,
కొండల్లా పెరిగిన
అప్పులు తీర్చే మార్గం లేక
ప్రభుత్వాల తోడ్పాటు లేక
మరికొందరు రైతులు బలవన్మరణాలకు
పాల్పడుతున్నారు.
దేశంలో రైతుల
ఆత్మహత్యలకు కారణాలు,
పరిష్కారాలపై నేను
రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు
ప్రచురించింది.
ఆ వ్యాసాన్ని మీ
కోసం ఇక్కడ అప్లోడ్
చేస్తున్నాను.
Monday, 29 June 2015
Tuesday, 2 June 2015
Thursday, 28 May 2015
ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు
అవసరమైనది
దొరకనప్పుడు అదే మనకు ప్రియం
అవుతుంది. ఇజ్రాయెల్‌కు
లేనిది నీరు. అదే అక్కడ అపురూపం. అపురూపమైన
నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి
చుక్కనీరు వృథా కాకుండా
సమర్ధంగా వాడుకున్నారు. జాతిగా
తమకున్న అపార మేథోశక్తిని
ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా
సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఆవిష్కరించారు. వాటి
సాయంతో ఊహకందని ఫలితాలను
రాబట్టుకున్నారు. ఏదీ
దొరకని చోట అన్నీ దొరికేలా
చేసుకున్నారు. అన్నీ
ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా
నిలిచారు. నా
ఇజ్రాయెల్ పర్యటనలో చూసిన
అనుభవాలతో రెండు దేశాల మధ్య
ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు
రాజకీయాలు మన రైతులకెంత శాపంగా
పరిణమించాయో నాకు అర్ధమైంది. ఈ
రెండు దేశాలకూ ఉన్న ప్రధాన
వ్యత్యాసం ఇదే. మిగతావన్నీ
దీని తర్వాతే.
భారత్
తో పోల్చితే ఇజ్రాయెల్
వ్యవసాయంలో ఉన్నదీ మనకు
లేనిదీ.,
రెండు
దేశాల మధ్య ఉన్న సారూప్యాలు,
వ్యావసాయకంగా
ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన
వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు
ప్రచురించింది.
మీ
కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Wednesday, 13 May 2015
ఇజ్రాయెల్ వ్యవసాయంపై కొన్ని కథనాలు
ఇజ్రాయెల్
పర్యటన సందర్భంగా నేను ఏకకాలంలో అటు ఈనాడుకు ఇటు ఈటీవీకి పనిచేయాల్సి
వచ్చింది. చూసిన ఒక అంశంపై ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవడం అదే సమయంలో వారు
వివరిస్తున్న సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బందులు ఎదురైనా., అవన్నీ
తెలుసుకోవాలనే నా ఆసక్తి ముందు తేలిపోయాయి. ఈ పర్యటన సందర్బంగా ఈనాడుకు
నేను రాసిన కథనాల క్లిప్పింగ్స్‌ను ఇక్కడ ఇస్తున్నాను. మరికొన్ని కథనాలు
రాస్తున్నాను. మునుముందు వాటినీ ముఖపుస్తక మిత్రులకు అందిస్తాను. ఈటీవీలో
4వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇజ్రాయెల్ వ్యవసాయంపై ఇదీసంగతిలో ఒక అరగంట
ప్రత్యేక కార్యక్రమంతో పాటు మరికొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఇందుకు
సహకరించిన ఈనాడు, ఈటీవీ సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని,
కథనాలను చూసి ప్రశంసించిన మా గౌరవ ఛైర్మన్ రామోజీరావుకు వేనవేల కృతజ్ఞతలు.


Wednesday, 6 May 2015
సహచరుల ఆత్మీయత మరువలేను
ఇజ్రాయెల్ నుంచి రాగానే నా సహచర బృందం నాకో తీపి జ్ఞాపకాన్ని అందించింది.
పాత్రికేయంలో మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆశీర్వదించింది. ఒక బాస్‌గా కాకుండా
వారి బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తున్న ఒక శ్రేయోభిలాషిగా వారు నన్ను
చూస్తున్న తీరు నాకు సంతోషానిచ్చింది. నా బృందంలోని ప్రతి ఒక్కరికీ
పేరుపేరునా వందనాలు. మిత్రులారా మీ ఆత్మీయతను మరువలేను. మీ పట్ల నా
బాధ్యతలను ఏ నాడూ మరచిపోను. అందరికీ ధన్యవాదాలు.
Sunday, 3 May 2015
ఆహార వృథా... ఆకలి వ్యథ
ఇజ్రాయెల్‌లో నాకిచ్చిన రోమింగ్‌కార్డు నన్ను తీవ్రంగా సతాయించింది. అందుకే
ఏ పోస్టులూ పెట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత ముఖపుస్తకం ద్వారా
మిత్రులతో మాట్లాడే అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్ పర్యటన నాకు మంచి
విషయాలను వారి సాంకేతికత గొప్పదనాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది. వీటిని
క్రోడీకరించి ఈటీవీలో ఇప్పటికే 4 కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు రాత్రి 7.30
గంటలకు ఒక అరగంట సేపు ఇజ్రాయెల్ సాంకేతికతపై స్పెషల్ ఫీచర్ ఇస్తున్నాము.
వీలైతే చూడండి. అలానే ఈనాడుకూ కథనాలు పంపిస్తున్నాను. అన్నట్టు ఆహార వృథా
ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఇజ్రాయెల్ ప్రదర్శనపై ఈరోజు నేను రాసిన
వ్యానం ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చింది. చూడగలరు. మీ కోసం ఆ క్లిప్పింగ్
ఇక్కడ ఇస్తున్నాను.
Wednesday, 22 April 2015
ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం
ఇది నేను ఎంత మాత్రం ఊహించని ఆహ్వానం. అదీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం తనకు తాను నన్ను తన దేశానికి ఆహ్వానిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇదొక గొప్ప విషయం అని నేను చెప్పటం లేదు కానీ., నాకు వృత్తి పరంగా సంతృప్తినిచ్చిన అంశం కాబట్టి మిత్రులతో పంచుకోవాలని అనిపించింది.
ఇజ్రాయెల్ లో ఈ నెల 27 నుంచి జరగనున్న ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన, సదస్సులో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్ నుంచి ఐదుగురు సీనియర్ జర్నలిస్టులను ఒక ప్రతినిధి బృందంగా తీసుకువెళుతోంది. ఈ డెలిగేషన్ లో నాతో పాటు కోల్ కతా నుంచి ఒకరు, ఏబీపీ ఛానల్ నుంచి ఒకరు, పీటీఐ నుంచి ఒకరు, దిల్లీ నుంచి మరొక జర్నలిస్ట్ ను తీసుకువెళుతున్నట్టు ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది.
22 ఏళ్ళ జర్నలిజం అనుభవంలో ఇది నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇన్నేళ్ళ జర్నలిజం లో రైతుల కోసం ప్రింటు మీడియాకు ఆర్టికల్స్ రాస్తూ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు., ఇజ్రాయెల్ ఆహ్వానం పలకడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్ళ నా జర్నలిజం ప్రయాణంలో నాకు వెన్నంటి నిలిచిన మా చైర్మన్ రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, మా సీఈఓ బాపినీడు గారికి ఈ విషయం చెప్పగానే వెళ్ళిరమ్మని ప్రోత్సహించడం, అన్ని విధాలా సహకారం అందించడం సంతోషాన్నిచ్చింది. వారికి నా కృతజ్ఞతలు. నా ఈ పర్యటనకు విశేషంగా తోడ్పడిన ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి అధ్యక్షులు కెన్ సాగర్ గారికి., సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
Subscribe to:
Posts (Atom)















