Friday, 8 November 2013
Saturday, 2 November 2013
Wednesday, 30 October 2013
సర్కారు నిర్లక్ష్యమే అసలు విపత్తు!
విపత్తులు ఉరుముతున్నప్పుడల్లా రాష్ట్ర రైతులు చిగురుటాకులా కంపించిపోతున్నాడు. ఏటా ఉత్పాతాలు విరుచుకుపడిన ప్రతిసారీ పంటలు ధ్వంసమై రైతులు చితికిపోతుండటం పరిపాటిగా మారుతోంది. గడచిన పదేళ్ళలో నాలుగు పంటలే దక్కాయి. నష్టం జరిగిన ప్రతిసారీ పాలకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చిటికిన బతుకులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టడం లేదు. విపత్తుల విషయంలో ప్రకృతి కంటే ప్రభుత్వమే రైతుల్ని ఎక్కువగా గాయపరుస్తోందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
Sunday, 8 September 2013
వినాయక చవితి శుభాకాంక్షలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!
సర్వేజనా సుఖినోభవంతు.
Friday, 6 September 2013
వ్యవ"సాయం" తోనే ఆహార భద్రత
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్రం గొప్ప ముందడుగు వేయడం సంతోషించదగిన విషయమే. కానీ ఆహార భద్రత కల్పించే క్రమంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను కేంద్రం ఉపెక్షిస్తుండటమే విచారకరం. దేశంలో తిండి గింజలు పండించే రైతులే ఒక పూట తిండికి నోచుకోలేక పోతున్నారు. వారి సంక్షేమం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా., రెట్టింపు దిగుబడులు సాధించాలంటే రైతుకు ఏ విధంగా చేయూత నివ్వాలనే అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఆహార భద్రత సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుకు భద్రత కల్పిస్తేనే ఆహార భద్రత సుసాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Friday, 5 July 2013
కాగితాల్లోనే కార్యాచరణ!
ఏటా వ్యవసాయ కార్యాచరణ కాగితాల్లోనే కనిపిస్తోంది తప్ప పంట దిగుబడుల్ని పెంచేందుకు, రైతుల్ని ప్రోత్సహించేందుకు సర్కారు చిత్తశుద్దిని చూపటం లేదు. ఏటికేడూ లక్ష్యాలు ఘనంగానే కనిపిస్తున్న వాటిని సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి బొత్తిగా శూన్యం. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, సాగునీరు వంటి పంట ఉత్పాదకాలు అందటం ఎంత ముఖ్యమో సాంకేతికతను ఉపయోగించి మెరుగైన దిగుబడులు సాదించేలా రైతులకు సాగు విధానాల్లో సలహాలు అందించడం అంటే ప్రధానం. ఇవన్నీ విస్మరిస్తున్న కారణంగా అధికోత్పత్తులు సాధించడంలో ఆశించిన పురోగతి సాధ్య పడటం లేదు. ఇప్పటికైనా సాగు చేస్తున్న రైతులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలు చూపగలిగితే మన రైతులు అధ్బుత దిగుబడులు సాధించడంలో ప్రపంచంలో ఎవరికీ తీసిపోరనటంలో సందేహం లేదు. ఎటొచ్చీ సర్కారు చిత్తశుద్ది పైనే సందేహమంతా...!
Sunday, 30 June 2013
"శివగీతార్చన"
Subscribe to:
Posts (Atom)









