Pages

Thursday, 28 February 2013

నిరాశ పరచిన చిదంబరం

                                                              
భారీ అంకెల తిరగమోతగానే యూపీఏ-2 చివరి సంపూర్ణ బడ్జెట్ ను చిదంబరం మహా ఘనంగానే వండి వార్చారు. పన్నుల సంస్కరణల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ను ప్రకటించిన చిదంబరం .. జన సామాన్యం పై వడ్డన భారం పొంచే ఉందని పరోక్షంగా చెప్పారు. గత ఏడాది ఏడాది కంటే 22 శాతం పెంచి వ్యవసాయరంగానికి 27 వేల 49 కోట్లు కేటాయించారు. అలానే ఏడు లక్షల కోట్ల రైతు రుణాల లక్ష్యంలో మంజూరయ్యేది ఎంతన్నదే అసలు ప్రశ్న! రైతుల భధ్రతకు భరోసా ఇవ్వకుండా ఆహార భధ్రత కు సైతం పెద్దగా కేటాయింపులు లేకుండా చిదంబరం బడ్జెట్ చాలా చప్పగా ఉంది. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే ..... అటు ఎన్నికల ఊసులు ఎక్కువగా లేకుండా ఇటు సంక్షేమం ఆశలు వెల్లివిరియకుండా ఎవరినీ పెద్దగా సంతృప్తి పరచకుండానే సాగిన బడ్జెట్ ఇది. 

Monday, 25 February 2013

బడ్జెట్లలో వ్యవ'సాయం' అంతంత మాత్రమే!

ఏళ్ళు గడుస్తున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆహారభద్రత గురించి గొంతు చించుకుంటున్న యూపీఏ ప్రభుత్వం దీనికి మూలమైన వ్యవసాయ రంగ అభివృద్ధిని విస్మరిస్తోంది.  సాగులో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాలంటే రైతుకు చేయూత అవసరం. అందుకు తగిన సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. ఇవేమీ చేయకుండానే వ్యవసాయం బాగున్నట్టు ఆహార భద్రత కల్పించేస్తామంటూ కేంద్రం ప్రజల్ని మభ్య పెడుతోంది. దశాభ్దాలుగా సేద్యరంగాన్ని  నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతుల పరిస్థితి దిగజారింది. ముందు రైతుల్ని నిలబెట్టే చర్యలకు ఉపక్రమించకుండా  బడ్జెట్లలో కేంద్రం వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపుతూ వచ్చింది. 28న కేంద్రం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండాలి ? రైతుల పరిస్థితి మెరుగు పడాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.     
                                                                 

Tuesday, 12 February 2013

ఉత్పాద'కత' మారేదేలా?

వ్యవసాయంలో దేశం ఎంతో పురోగమించింది అన్నది తిరుగులేని వాస్తవం. మరి మన రైతులెందుకు చితికిపోతున్నారు..?  అన్ని వర్గాల ప్రజలు జీవితంలో ఎంతో కొంత ప్రగతి సాధిస్తే., రైతుల పరిస్థితే  ఎందుకని దిగజారుతోంది.. ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక పోతున్నాయి. రైతు శ్రేయం కాపాడే విషయంలో చేతకానివిగా మిగిలిపోతున్నాయి. రైతుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రభుత్వాలకు తెలిసినా అవి అందించే విషయంలో ఆడ్డుపడుతున్న శక్తులను నియంత్రించలేని తీరు వల్ల అన్నదాతలు సేద్యంలో చితికిపోతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే.., హెక్టారు సగటు ఉత్పాదకతలో ఆశించిన పురోగతి లేక రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. కాయకష్టం చేసి సిరులు పండిస్తున్నా రైతుల పరిస్థితి దయనీయంగా ఉండటానికి దారితీస్తున్న  కారణాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                             

Sunday, 13 January 2013

పొలంలో పండాలి క్రాంతి


సంక్రాంతి రైతుల పండగ. ధాన్యపు రాశులు ఇంటికి చేరే సమయం కాబట్టే  ఇది రైతుల పండగయ్యింది. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో, రైతుల ముంగిళ్ళలో కనిపించే ఆ శోభ అనిర్వచనీయం. దురదృష్టవశాత్తూ రైతుల కళ్ళల్లో పండగ నాటి ఆనందం నేడు కనిపించడం లేదు. చేతి నిండా నాలుగు డబ్బులుండే పరిస్థితుల నుండి మన రైతులు పంట ఇంటికి చేరకుండానే కల్లంలోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాల చేయూత లేక చితికిన రైతుల్ని  ఎవరూ పట్టించుకోకపోవడంతో  అన్నదాతలు సంక్రాంతి ఆనందాలకు దూరమవుతున్నారు. ఈ  పరిస్థితులను విశ్లేసిస్తూ నేను రాసిన  వ్యాసాన్ని నేటి  సంక్రాంతి రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేశాను. 

                                                                                                                                                              

                                                                       

సంక్రాంతి శోభ

                                                                    
బ్లాగు మిత్రులందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు.  పల్లె ఆకు పచ్చని చీర కట్టుకుని పరవశించే పండగ వేళ సొంతూర్లో ఉంటె ఆ ఆనందమే వేరు. మాది  గుంటూరు జిల్లా వేమూరు. కోనసీమ  పల్లె అందాలను  పుణికి పుచ్చుకున్నట్టు ఎటు చూసినా పచ్చదనంతో, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది మా వూరు. గతేడాది వెళ్ళలేకపోయినా ఈసారి సంక్రాంతికి వూళ్ళో ఉండాలని గట్టిగా తీర్మానించుకుని వచ్చేశాను. వీలు చిక్కినప్పుడల్లా వూరుకు చెక్కేయడం చెప్పలేని ఆనందం. ఎవరికైనా సొంతూరి గాలి, నీరు, నేల... అసలక్కడి గాలి ఒక్కసారి పీల్చితే చాలు కొన్నాళ్ళకు సరిపడా శక్తిని సమకూర్చుకోవచ్చు. ఇలా చెబుతుంటే గుర్తొచ్చింది... మిత్రుడు గజల్ శ్రీనివాస్ సంక్రాంతి రోజు ఉదయం 9.30 గంటలకు ఈటీవీ-2 లో ఓ  మంచి పాట పాడారు. ఒక్కసారి పల్లెకు వెళ్లి రావాలని చెబుతూ ఆలపించిన ఈ గీతం మిమ్మల్ని మీ వూరు తీసుకువెళుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఎంచక్కా పండగ సంబరాలను ఆస్వాదించాలని కోరుకుంటూ మరోసారి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 

Monday, 31 December 2012

నూతన వత్సరంలో కొత్త సంకల్పం

                                                             
ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  నిరుటి ప్రమాణాలను ఎంత వరకు పాటించామో., ఆ లక్ష్యాలను ఎంత వరకు అధిగామించామో నేడు ఒక్కసారి తరచి చూసుకోవాలి. ఆ లోటుపాట్లను సమీక్షించుకుని కొత్త గమ్యాన్ని నిర్దేశించుకుందాం. జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూనే వాస్తవంలో నెరవేర్చాల్సిన కర్తవ్యానికి వెన్నంటే ఉందాం. ఒక ఆశావహ భవిష్యత్తు దిశగా జీవితాన్ని నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనకు అనంతమైన శక్తి యుక్తులు ఇవ్వాలని  ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటూ అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Friday, 28 December 2012

2012లో వ్యవసాయకంగా అడుగు వెనక్కే!


వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు వదల్లేదు. వరుస విపత్తులు  రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.  పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.