Pages

Sunday, 4 September 2016

వినాయక చవితి, గురు పూజోత్సవ శుభాకాంక్షలు

మిత్రులందరికీ వినాయక చవితి  శుభాకాంక్షలు.  నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.


Friday, 12 August 2016

రావాలి మరో సస్య విప్లవం!

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ్యవసాయ రంగం , రైతుల పరిస్ధితి పై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేసాను.

Monday, 9 May 2016

పేద దేశాల రైతుల్ని శాసిస్తున్న సంపన్న దేశాలు

ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) సమావేశాల్లో ప్రతిసారీ పేద దేశాల కంటే గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు అమెరికా ఐరోపా దేశాల పన్నుతున్న కుట్రలు వర్ధమానే దేశాల్లో వ్యవసాయరంగాన్ని, దానిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్ని ఎలా దెబ్బతీస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా నైరోబీలో జరిగిన సమావేశంలో ఎగుమతి రాయితీలపై సంపన్న దేశాల ఉచ్చులో పడ్డ భారత్‌, తానెలంటా సంతకం చేయలేదని చెబుతున్నప్పటికీ ఇంకా మేలుకోని పక్షంలో మన రైతుల ప్రయోజనాలను దెబ్బతినే అవకాశముందని., అలానే వేలం వెర్రిగా పత్తి సాగుకి దిగే బదులు సరైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్‌లోడ్‌ చేశాను..          
                                                          

Thursday, 24 March 2016

రైతుకు ధీమా కొత్త పంటల బీమా

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ ఖరీఫ్‌ నుంచి అమలు చేయనున్న కొత్త పంటల బీమా పథకం రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించనుంది. ఈ పథకం అందించే ప్రయోజనాలు, అమలులో తలెత్తే లోపాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. అప్‌లోడ్‌ చేసిన నా వ్యాసం  మీ కోసం....
                                                              

Tuesday, 1 March 2016

రైతు సంక్షేమ రాగం

సాగుదార్ల సంక్షేమం ధ్యేయంగా మోది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి బడ్జెట్‌ ఇది. సేద్యానికి భారీ కేటాయింపులతో రైతులు స్థితిగతులు ఒక్కసారిగా ఏమీ మారిపోవు కానీ వారి శ్రేయం దిశగా పడిన తొలి అడుగు ఇది. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ క్లిప్పింగ్‌ మీ కోసం....

Thursday, 31 December 2015

కర్షకరత్న పురస్కారం

మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం 9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Tuesday, 10 November 2015

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు..
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.