Pages

Sunday, 3 May 2015

ఆహార వృథా... ఆకలి వ్యథ

ఇజ్రాయెల్‌లో నాకిచ్చిన రోమింగ్‌కార్డు నన్ను తీవ్రంగా సతాయించింది. అందుకే ఏ పోస్టులూ పెట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత ముఖపుస్తకం ద్వారా మిత్రులతో మాట్లాడే అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్‌ పర్యటన నాకు మంచి విషయాలను వారి సాంకేతికత గొప్పదనాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది. వీటిని క్రోడీకరించి ఈటీవీలో ఇప్పటికే 4 కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఒక అరగంట సేపు ఇజ్రాయెల్‌ సాంకేతికతపై స్పెషల్‌ ఫీచర్‌ ఇస్తున్నాము. వీలైతే చూడండి. అలానే ఈనాడుకూ కథనాలు పంపిస్తున్నాను. అన్నట్టు ఆహార వృథా ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఇజ్రాయెల్‌ ప్రదర్శనపై ఈరోజు నేను రాసిన వ్యానం ఈనాడు ఎడిట్‌ పేజీలో వచ్చింది. చూడగలరు. మీ కోసం ఆ క్లిప్పింగ్‌ ఇక్కడ ఇస్తున్నాను.
                                                             

Wednesday, 22 April 2015

ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

                                                       

ఇది నేను ఎంత మాత్రం ఊహించని ఆహ్వానం. అదీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం తనకు తాను నన్ను తన దేశానికి ఆహ్వానిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇదొక  గొప్ప విషయం అని నేను చెప్పటం లేదు కానీ.,  నాకు వృత్తి పరంగా సంతృప్తినిచ్చిన అంశం కాబట్టి మిత్రులతో పంచుకోవాలని అనిపించింది.
ఇజ్రాయెల్ లో ఈ నెల 27 నుంచి జరగనున్న ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన, సదస్సులో పాల్గొనేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్ నుంచి ఐదుగురు సీనియర్ జర్నలిస్టులను ఒక ప్రతినిధి బృందంగా తీసుకువెళుతోంది. ఈ డెలిగేషన్ లో నాతో పాటు కోల్ కతా నుంచి ఒకరు, ఏబీపీ ఛానల్ నుంచి ఒకరు, పీటీఐ నుంచి ఒకరు, దిల్లీ నుంచి మరొక జర్నలిస్ట్ ను తీసుకువెళుతున్నట్టు ఇజ్రాయెల్ ఎంబసీ తెలిపింది.
22 ఏళ్ళ జర్నలిజం అనుభవంలో ఇది నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇన్నేళ్ళ జర్నలిజం లో రైతుల కోసం ప్రింటు మీడియాకు ఆర్టికల్స్ రాస్తూ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న నాకు.,  ఇజ్రాయెల్  ఆహ్వానం పలకడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్ళ నా జర్నలిజం ప్రయాణంలో నాకు వెన్నంటి నిలిచిన  మా చైర్మన్ రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, మా సీఈఓ బాపినీడు గారికి ఈ విషయం చెప్పగానే వెళ్ళిరమ్మని ప్రోత్సహించడం, అన్ని విధాలా సహకారం అందించడం సంతోషాన్నిచ్చింది. వారికి నా  కృతజ్ఞతలు. నా ఈ పర్యటనకు విశేషంగా తోడ్పడిన ఇండో-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి అధ్యక్షులు కెన్ సాగర్ గారికి., సెంటర్ ఫర్ హ్యుమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 

Friday, 20 March 2015

తెలుగుదనం పల్లవించే పండుగ

                                                                           

తెలుగుదనం నిండుగా మెండుగా పల్లవించే పండుగ ఉగాది. తెలుగుదనపు మాధుర్య సొగసులు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిఫలించే పండుగ యుగాది. కల్పాదిలొ బ్రహ్మ సృష్టిని ఆరంభించినదీ., వనవాసం తర్వాత
శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్నది ఉగాదినాడే. ఆందుకే పండుగలన్నింటిలోకి ఉగాది ప్రత్యేకతే వేరు. మామిడి తోరణాలతో, మల్లెల గుబాళింపులతో, కోయిల కుహూ రావాలతో, వసంత సౌకుమార్యంతో శ్రీమన్మధ నామ సంవత్సర ఉగాది నేడు తరలి వచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నా శుభాకాంక్షలు- అమిర్నేని హరికృష్ణ 

నాకు ఉగాది మీడియా పురస్కారం

                                                               
      
హైదరాబాద్ కు చెందిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ ఏడాది  "ఉగాది మీడియా పురస్కారం" కు నాతోపాటు మరికొందరు సీనియర్ జర్నలిస్టులను ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి చెప్పారు. ఆహ్వానం పంపించారు. సుదీర్ఘకాలం మీడియా లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఎడిటర్లకు ఈ అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. నాతొ పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైయెస్సార్ శర్మ, సూర్య ఎడిటర్ సత్యమూర్తి, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్. వీరయ్య, కళ పత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీ, అంకం రవి (వీ6 ఛానల్ ) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ టీవీ ), హరిప్రసాద్ (టీవీ9), ఈశ్వర్ (6టీవీ), సాయి (జెమిని న్యూస్)లు  కూడా ఉగాది మీడియా పురస్కారాలు అందుకోనున్నారు.
అయితే  రవీంద్రభారతి లో  అవార్డు తీసుకోవాల్సిన 23వ తేదీన  నేను తిరుమలలో ఉండాల్సిన కారణంగా ఈ అవార్డును నేను స్వయంగా స్వీకరించలేకపోతున్నట్టు  నిర్వాహకులకు తెలిపాను. నా తరపున సహచరుడు మధుసూధనాచారి ఈ అవార్డును స్వీకరిస్తారు. నా మిత్రులు, మరికొందరు సీనియర్ జర్నలిస్టు మిత్రులను ఈ సందర్భంగా కలుసుకోలేక పోతున్నందుకు కొంత బాధగానూ ఉంది.  నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు.

Monday, 2 March 2015

రైతులంటే అందరికీ చులకనే!

వ్యవసాయంలో 4 శాతం వృద్ధి రేటు సాధించాలంటే ఆందుకు అనుసరించే వ్యూహం సరైనదై ఉండాలి. నిర్దిష్ట వ్యుహాలేమీ లేకుండా సేద్యానికి మొండిచేయి చూపించింది కేంద్ర బడ్జెట్. దిశ దశ లేకుండా వ్యవసాయంలో ఏదో సాధించేస్తామంటే అది ఒట్టిమాటే. జైట్లీ బడ్జెట్ లో ఇటువంటి కమ్మని కబుర్ల్లెన్నో ఉన్నాయి. ''దేశంలో రైతు జేబు నింపడానికి వ్యవసాయరంగానికి తగిన సామర్ధ్యం ఉంది అన్న ప్రభుత్వానికి, రైతు శ్రేయం పట్ల మాత్రం నిజమైన చిత్తశుద్ధి లేకపోయింది.'' కేంద్రబడ్జెట్ లో వ్యవసాయరంగాన్ని విస్మరించిన తీరుపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                   
                                                                          

Wednesday, 14 January 2015

సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే రైతుల పండుగ. పల్లెల పండుగ.  పల్లె, పట్టణ సీమలన్నీ సంక్రాంతి శోభతో వెల్లివిరిసిన ఈ వేళ...  ప్రతి ఒక్కరి మనసు సంతోషంతో నిండాలని., పంటలు బాగా పండి రైతులందరూ సుఖంగా జీవించాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.


Friday, 2 January 2015