Pages

Friday, 20 March 2015

నాకు ఉగాది మీడియా పురస్కారం

                                                               
      
హైదరాబాద్ కు చెందిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ ఏడాది  "ఉగాది మీడియా పురస్కారం" కు నాతోపాటు మరికొందరు సీనియర్ జర్నలిస్టులను ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి చెప్పారు. ఆహ్వానం పంపించారు. సుదీర్ఘకాలం మీడియా లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఎడిటర్లకు ఈ అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. నాతొ పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైయెస్సార్ శర్మ, సూర్య ఎడిటర్ సత్యమూర్తి, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్. వీరయ్య, కళ పత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీ, అంకం రవి (వీ6 ఛానల్ ) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ టీవీ ), హరిప్రసాద్ (టీవీ9), ఈశ్వర్ (6టీవీ), సాయి (జెమిని న్యూస్)లు  కూడా ఉగాది మీడియా పురస్కారాలు అందుకోనున్నారు.
అయితే  రవీంద్రభారతి లో  అవార్డు తీసుకోవాల్సిన 23వ తేదీన  నేను తిరుమలలో ఉండాల్సిన కారణంగా ఈ అవార్డును నేను స్వయంగా స్వీకరించలేకపోతున్నట్టు  నిర్వాహకులకు తెలిపాను. నా తరపున సహచరుడు మధుసూధనాచారి ఈ అవార్డును స్వీకరిస్తారు. నా మిత్రులు, మరికొందరు సీనియర్ జర్నలిస్టు మిత్రులను ఈ సందర్భంగా కలుసుకోలేక పోతున్నందుకు కొంత బాధగానూ ఉంది.  నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు.

Monday, 2 March 2015

రైతులంటే అందరికీ చులకనే!

వ్యవసాయంలో 4 శాతం వృద్ధి రేటు సాధించాలంటే ఆందుకు అనుసరించే వ్యూహం సరైనదై ఉండాలి. నిర్దిష్ట వ్యుహాలేమీ లేకుండా సేద్యానికి మొండిచేయి చూపించింది కేంద్ర బడ్జెట్. దిశ దశ లేకుండా వ్యవసాయంలో ఏదో సాధించేస్తామంటే అది ఒట్టిమాటే. జైట్లీ బడ్జెట్ లో ఇటువంటి కమ్మని కబుర్ల్లెన్నో ఉన్నాయి. ''దేశంలో రైతు జేబు నింపడానికి వ్యవసాయరంగానికి తగిన సామర్ధ్యం ఉంది అన్న ప్రభుత్వానికి, రైతు శ్రేయం పట్ల మాత్రం నిజమైన చిత్తశుద్ధి లేకపోయింది.'' కేంద్రబడ్జెట్ లో వ్యవసాయరంగాన్ని విస్మరించిన తీరుపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                   
                                                                          

Wednesday, 14 January 2015

సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే రైతుల పండుగ. పల్లెల పండుగ.  పల్లె, పట్టణ సీమలన్నీ సంక్రాంతి శోభతో వెల్లివిరిసిన ఈ వేళ...  ప్రతి ఒక్కరి మనసు సంతోషంతో నిండాలని., పంటలు బాగా పండి రైతులందరూ సుఖంగా జీవించాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.


Friday, 2 January 2015

Tuesday, 23 December 2014

అపరాలకు ఆదరువేదీ?

హరిత విప్లవానంతరం సారవంతమైన నేలల నుంచి వర్షాధారపు భూములకు మళ్ళించాక దేశంలో పప్పుదాన్యాల సాగు, సాగుదార్ల  పరిస్థితి దయనీయంగా  మారింది. దశాబ్దాలు గడుస్తున్నా విస్తీర్ణం, ఉత్పత్తి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని విశ్లేషిస్తే., రెండు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకటి.. దేశ ప్రజల్లో  పోషక విలువలు తగ్గిపోవడం, రెండోది ఈ పంటలు సాగు చేసే రైతులు అప్పులపాలవటం... దేశంలో ఈ పంటల సాగు వృద్ధి చెందకపోవడానికి దారితీసిన పరిస్థితులు, దిగుబడులు పెంచేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం నా వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. 
                                                                        

దర్శక కళాత్మక శిఖరం బాలచందర్

                                                                              


ఒక మరోచరిత్ర, ఒక అంతులేని కథ.., ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్... సెల్యులాయిడ్ సంచలనాలైన ఇటువంటి కళాఖండాలను ఇక చూడలేము., వెండితెర వెలిగినన్నాళ్ళూ చిరస్థాయిగా నిలిచే సినిమాలు తెరకెక్కించటమేగాక, జాతి గర్వించే మేటి నటుల్ని అందించిన దర్శక కళాత్మక శిఖరం బాలచందర్ ఇక లేరనే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ... 

Monday, 8 December 2014

జనావళి జీవధార చెరువు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జీవనాధారమైన వేలాది చెరువులు నేడు ధ్వంసమయ్యాయి. కాకతీయుల కాలం నుంచి చెరువుల చుట్టూ పెనవేసుకున్న ప్రజల జీవితాలను ఈ చెరువుల విధ్వంసం  ఆ తర్వాత కాలంలో తీవ్రంగా ప్రభావితం చేసింది. కెసీఆర్ ప్రభుత్వం "మిషన్ కాకతీయ" పేరుతొ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపడుతోంది. చెరువుల పునరుద్ధరణ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంలా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు తెలంగాణ ఎడిషన్ ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.