విపత్తులు ఉరుముతున్నప్పుడల్లా రాష్ట్ర రైతులు చిగురుటాకులా కంపించిపోతున్నాడు. ఏటా ఉత్పాతాలు విరుచుకుపడిన ప్రతిసారీ పంటలు ధ్వంసమై రైతులు చితికిపోతుండటం పరిపాటిగా మారుతోంది. గడచిన పదేళ్ళలో నాలుగు పంటలే దక్కాయి. నష్టం జరిగిన ప్రతిసారీ పాలకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చిటికిన బతుకులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టడం లేదు. విపత్తుల విషయంలో ప్రకృతి కంటే ప్రభుత్వమే రైతుల్ని ఎక్కువగా గాయపరుస్తోందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.
Wednesday, 30 October 2013
Sunday, 8 September 2013
వినాయక చవితి శుభాకాంక్షలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!!
సర్వేజనా సుఖినోభవంతు.
Friday, 6 September 2013
వ్యవ"సాయం" తోనే ఆహార భద్రత
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్రం గొప్ప ముందడుగు వేయడం సంతోషించదగిన విషయమే. కానీ ఆహార భద్రత కల్పించే క్రమంలో నిర్లక్ష్యం చేయకూడని అంశాలను కేంద్రం ఉపెక్షిస్తుండటమే విచారకరం. దేశంలో తిండి గింజలు పండించే రైతులే ఒక పూట తిండికి నోచుకోలేక పోతున్నారు. వారి సంక్షేమం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా., రెట్టింపు దిగుబడులు సాధించాలంటే రైతుకు ఏ విధంగా చేయూత నివ్వాలనే అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఆహార భద్రత సాధించాలంటే ముందుగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుకు భద్రత కల్పిస్తేనే ఆహార భద్రత సుసాధ్యమవుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Friday, 5 July 2013
కాగితాల్లోనే కార్యాచరణ!
ఏటా వ్యవసాయ కార్యాచరణ కాగితాల్లోనే కనిపిస్తోంది తప్ప పంట దిగుబడుల్ని పెంచేందుకు, రైతుల్ని ప్రోత్సహించేందుకు సర్కారు చిత్తశుద్దిని చూపటం లేదు. ఏటికేడూ లక్ష్యాలు ఘనంగానే కనిపిస్తున్న వాటిని సాకారం చేసుకునేందుకు చేస్తున్న కృషి బొత్తిగా శూన్యం. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, సాగునీరు వంటి పంట ఉత్పాదకాలు అందటం ఎంత ముఖ్యమో సాంకేతికతను ఉపయోగించి మెరుగైన దిగుబడులు సాదించేలా రైతులకు సాగు విధానాల్లో సలహాలు అందించడం అంటే ప్రధానం. ఇవన్నీ విస్మరిస్తున్న కారణంగా అధికోత్పత్తులు సాధించడంలో ఆశించిన పురోగతి సాధ్య పడటం లేదు. ఇప్పటికైనా సాగు చేస్తున్న రైతులు వివిధ స్థాయిల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలు చూపగలిగితే మన రైతులు అధ్బుత దిగుబడులు సాధించడంలో ప్రపంచంలో ఎవరికీ తీసిపోరనటంలో సందేహం లేదు. ఎటొచ్చీ సర్కారు చిత్తశుద్ది పైనే సందేహమంతా...!
Sunday, 30 June 2013
"శివగీతార్చన"
Friday, 14 June 2013
సీజన్ ముంగిట రైతులు చిత్తుచిత్తు!
సకాలంలో వర్షాలు కురిసినా విత్తనాలు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు . సర్వం సిద్ధం చేశామంటున్నవ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులు ఏటా ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపలేక పోతోంది. సీజన్ ముంగిట రైతుకు విత్తన సమస్యలు మామూలు అవుతున్నా సర్కారులో సర్కారులో చలనం లేదు. పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలోనూ రైతుకు పంట ఉత్పాదకాలను సకాలంలో అందించడం ద్వారా వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించటం లేదు. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసి చెప్పినా రైతులు దుక్కులు దున్నే నాటికి విత్తనాలు సిద్దం చేయాల్సిన సర్కారు యెంత సన్నద్ధంగా ఉందో., నేడు రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడుతున్న పాట్లను చూస్తే తెలుస్తుంది. రైతు శ్రేయం విషయంలో ఎప్పుడూ మొద్దు నిద్ర పోయే ప్రభుత్వాలకు అన్నదాతల కష్టాలు కనిపిస్తున్నాయా...?
Saturday, 11 May 2013
రైతు గుండెల్లో కార్పొరేట్ గునపం!
సదుపాయాలు కల్పించకుండా చిన్న రైతులు సేద్యంలో లాభాపడలేక
పోతున్నారంటూ కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది కేంద్ర
ప్రభుత్వం. రైతుకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఎలాంటి
అవకాశాలు కల్పించకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యవసాయ ఒప్పందాలను
కుదుర్చుకుంటోంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని స్వాగతించాలా వద్దా అనే
సంగతిని పక్కన పెడితే రైతుకు రక్షణ కల్పించే ఆంశాలను ఈ ఒప్పందాల్లో ఎందుకు
పొందు పరచలేదన్నదే ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ వ్యవసాయ విధానంలో రైతు
ప్రయోజనాలను విస్మరించిన ఆంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు "ఈనాడు"
ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Subscribe to:
Posts (Atom)









