నూతన సాగు సవాళ్ళను అందుకునే దిశగా సస్య శాస్త్ర పరిశోధనలు మరింత పదును తేలాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఆగ్రానమి కాంగ్రెస్ కు తొలిసారిగా ఆతిధ్యం ఇస్తోంది. నేటి నుంచి ఈ సదస్సు ప్రారంభం కానుంది.
Monday, 22 November 2021
Thursday, 18 November 2021
ఇది రైతుల విజయం
అన్నదాతల కృషి ఫలించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కాసేపటి కిందట కేంద్రం ప్రకటించడంపై దేశ వ్యాప్తంగా రైతులోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది రైతుల విజయం.
Wednesday, 3 November 2021
దీపావళి శుభాకాంక్షలు.
🪔✨కష్టాల చీకట్లను తొలగించి ఈ దీపావళి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ✨🪔
సంఘటితమైతేనే సత్ఫలితాలు
సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని లాభసాటి సేద్యం చేయాలంటే ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న విధానాలకు ఆధునికతను జోడించాలి. రైతులు ఒక్కరుగా కంటే సమష్టిగా సంఘటితంగా ఏర్పడితేనే ఇది సాధ్యం. ఉత్పత్తిదారుల సంఘాలుగా రైతులు ఏర్పడి సమష్టిగా ముందుకు సాగితే వచ్చే ప్రయోజనాలతో పాటు నాబార్డు వాటికి అందిస్తున్న చేయూతపై నేను రాసిన వ్యాసం నవంబరు 2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.
Subscribe to:
Posts (Atom)