దేశవ్యాప్తంగా
భూసారం క్షీణిస్తోంది. విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలను
చల్లేస్తున్న కారణంగా నేలల జీవం కోల్పోతున్నాయి. పంట మార్పిడి
పాటించకపోవడం, భూతాపం తదితర కారణాలతో నేలలు ఇప్పటికే నిస్సారమయ్యాయి.
తెలుగు రాష్ట్రాలలో భాస్వరం, జింక్, బోరాన్, మాంగనీస్, ఇనుము లోపాలు
తీవ్రంగా ఉన్నాయి. వీటిని సరిచేసే చర్యలు చేపట్టకుండా ఇలానే సేద్యం
సాగిస్తూ పోతే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత దారుణంగా పడిపోతుందంటూ నేను రాసిన
వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 29 March 2019
Monday, 25 March 2019
తాయిలాలే గెలుపు మంత్రాలా..?
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఎన్నికల్లో రైతుమంత్రం జపించాల్సిందే. రుణమాఫీలని ఒకరు, పెట్టుబడి సాయాలంటూ మరొకరు, సంక్షేమ పధకాలంటూ ఇంకొకరు. ఎన్నికలప్పుడే వీరికి రైతులు గుర్తుకొస్తారు తప్ప సాగుదార్ల వాస్తవ కష్టాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు చూపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
Friday, 8 March 2019
ఫసల్ బీమా... ఏదీ ధీమా?
స్వాతంత్ర్యానంతరం దేశాన్ని పాలించిన పార్టీలన్నీ రైతుల్ని నట్టేట ముంచాయి. పంటల బీమాను సక్రమంగా అమలు చేయడంలో అన్ని పార్టీలదీ వైఫల్యమే. మోదీ అధికారం చేపట్టాక తెచ్చి ఎంతో విభిన్నమైనదని ప్రకటించిన ఫసల్ బీమా డొల్లతనం ఆచరణలో నిరూపితమైంది. ఈ పథకం లోటుపాట్లపై నేను రాసిన వ్యాసాన్ని శుక్రవారం ఈనాడు దినపత్రిక ప్రచురించింది.
Subscribe to:
Posts (Atom)