Pages

Thursday 25 April 2013

చైతన్యం రావాల్సింది సర్కారులో....!

                                                               


ప్రభుత్వం మీ కోసం లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేసింది., ఈసారి  పనిముట్లకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, ఎరువులు కొరత లేకుండా చూస్తాం., విత్తనాలకు కొరత రానీయకుండా చూస్తాం....... రైతు చైతన్య యాత్రల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పెంచుతున్న అవగాహన ఇది. వాస్తవానికి రైతులకు అవగాహన పెంచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న సేధ్యరంగాన్ని గట్టెక్కించాలంటే రైతులకు మార్కెట్ తెలివిడిని పెంచే చర్యలు చేపట్టాలి. ఈ ఏడాది ఏయే పంటలకు గిరాకీ ఉంది.? ఏయే పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చెయాలి...? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఏ సమయంలో పంటను మార్కెట్ కు తీసుకువెళితే రైతుకు మంచి ధర వస్తుంది ...? ఒకవేళ ధర లేకపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది... ?  మంచి ధరలు ఎలానూ ఇవ్వలేని ప్రభుత్వం చైతన్య యాత్రల్లో రైతుకు నేర్పాల్సినవి ఇవే...! ఇవన్నీ వదిలిపెట్టి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని యాత్రల పేరిట ఈ జాతరకు ఖర్చు చేస్తుండటం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                           
  

Thursday 18 April 2013

శ్రీరాముడే నిజమైన స్ఫూర్తి ప్రదాత

                                                                 

ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు సదా పూజ్యనీయుడు. అత్యున్నత వ్యక్తిత్వంలోని స్పూర్తిమత్వాన్ని మనం రాముడులోనే చూస్తాం. ధర్మవర్తనుడుగా నిలవటమే కాకుండా విశిష్ట లక్షణాలతో సకల సద్గుణాల కలబోసిన వ్యక్తి కనుకే రాముడు జగదబిరాముడు అయ్యాడు. ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజనానికి మార్గదర్శకుడుగా నిలిచాడు. అటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం నుంచి  నేర్చుకోవడమే మానవాళికి నిజమైన వికాసం. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.    

Thursday 11 April 2013

శ్రీ విజయ ఉగాది శుభాకాంక్షలు

                                                         

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకునే పండుగే యుగాది ఉగాది. తొలి సంవత్సరాదిగా తెలుగు ప్రజలు వ్యవహరించే ఈ పండుగ రోజు ఉదయాన్నే పూజ చేసి షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడిని సేవించడం మన సంప్రదాయం. వసంత నవరాత్రులు ఆరంభమయ్యే ఈ శుభదినం నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సకల జనావళికి శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.